Kochadaiyaan trailer crosses 10 lakh views in a day

Kochadaiyaan trailer crosses 10 lakh views, rajinikanth, deepika padukone, kochadaiyaan, vikram simha, Robo,Rajnikanth,Avatar,Kochadaiiyaan

The first trailer of the highly anticipated Tamil period film Kochadaiyaan, starring superstar Rajinikanth has been unveiled today.

రజినీ ముందు అందరు బలాదూరే

Posted: 09/11/2013 10:19 AM IST
Kochadaiyaan trailer crosses 10 lakh views in a day

అంతర్జాలం అందుబాటులోకి వచ్చాక వాటి ఉపయోగం ఎవరికి ఎంత ఉందో కరెక్టుగా చెప్పలేం కానీ... సినిమా స్టార్లకు మాత్రం ఓ రేంజ్ లో ఉపయోగ పడుతుంది. ఇటీవలి కాలంలో సూపర్ స్టార్లకు సంబంధించిన సినిమా టీజర్ లకు, ట్రైలర్లకు నెట్ లో మంచి హిట్స్ వస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ లో పవన్, మహేష్ , జూనియర్ ఎన్టీఆర్ ల సినిమాల ట్రైలర్లకు రికార్డ్ హిట్స్ వచ్చి హల్ చల్ చేశాయి. ఇప్పుడు వీరందర్ని మించిన హిట్స్ సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కొచ్చాడయాన్ ’ సినిమా బీట్ చేసింది. కేవలం 24 గంటల్లోనే 1 మిలియన్ హిట్స్ సొంతం చేసుకొని రజినీ సినిమాకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని నిరూపించాయి. రజనీకాంత్ రాజు గెటప్‌లో గుర్రపుబండితో స్వారీ చేయడం, పోరుభూమిలో శత్రువులను చీల్చి చెండాడడం, స్టైలిష్‌గా స్టెప్పులు వేయడం వంటి సన్నివేశాలు అభిమానులను కేరింతలు కొట్టిస్తున్నాయి. ‘కోచ్చడయాన్’ చిత్రాన్ని రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. తెలుగులో ‘విక్రమసింహా ’ పేరుతో శ్రీ లక్ష్మీ గణపతి సంస్థ విడుదల చేయనుంది. దేశీయ భాషలే కాకుండా విదేశీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles