Kochadaiyaan teaser to be released sep 9

Rajinikanth, Deepika Padukone, Kochadaiyaan, Soundarya Ashwin, Ganesh Chaturthi

The first teaser of superstar Rajinikanth-starrer Tamil period-drama Kochadaiyaan will be released on the festive occasion of Ganesh Chaturthi Sep 9.

కొచ్చాడయాన్ టీజర్ వచ్చేస్తుంది

Posted: 09/02/2013 05:10 PM IST
Kochadaiyaan teaser to be released sep 9

‘రోబో ’ చిత్రం తరువాత నుండి ఇంత వరకు ప్రేక్షకుల ముందుకు రాని సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం తన కూతురు దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ‘కొచ్చాడయాన్ ’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగు ఎప్పడో ప్రారంభం అయినా, ఇంత వరకు విడుదలకు నోచుకోలేదు. దీనికి కారణం నిర్మాణంత కార్యక్రమాలే. ఎక్కువ శాతం గ్రాఫిక్స్ తోనే తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదల కోసం రజినీ అభిమానులే కాకుండా యావత్ సినీ లోకం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన తొలి టీజర్ ను ఈనెల 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మోషన్ కేప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతున్న తొలి భారతీయ చిత్రంగా రికార్డుకెక్కనున్న ఈ చిత్రం టీజర్ ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తిలో ప్రేక్షకులు ఉన్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. తండ్రి సరసన  శోభన, కొడుకు సరసన దీపికా పదుకొనే కథానాయికలుగా నటిస్తున్నారు. తమిళంతో బాటు పలు భాషల్లో దీనిని డబ్ చేస్తున్నారు. తెలుగులో 'విక్రం సింహా' పేరిట రిలీజ్ అవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles