Ram charan toofan release doubtful in tollywood

Ram Charan Toofan release Doubtful In Tollywood , Ram Charan Toofan release date, Mega Power Star Ram charan Toofan movie

Ram Charan Toofan release Doubtful In Tollywood , Ram Charan Toofan release date, Mega Power Star Ram charan Toofan movie

రామ్ చరణ్ ‘తుఫాన్ ’ కి తప్పని కష్టాలు

Posted: 08/24/2013 11:03 AM IST
Ram charan toofan release doubtful in tollywood

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి ఈ సంవత్సరం అంతగా కలిసి రానట్లే కనిపిస్తుంది. ఆ మధ్య వివాదాలు మొదలుకొని నేడు సినిమాల విడుదల ఆగడం వరకు అన్నీ సమస్యలే ఎదురవుతున్నాయి. చిరంజీవి కేంద్ర మంత్రి అయినందుకు సీమాంధ్ర ఉద్యమ ఎఫెక్టు ఆయన సినిమా పై పడింది. ఇప్పటికే ఆయన నటించిన ‘ఎవడు ’ సినిమా ఏకంగా దసరా వరకు వాయిదా పడింది. ఇప్పుడు తొలిసారిగా హిందీలో నటించిన ‘జంజీర్ ’ రీమేక్  తెలుగు వెర్షన్ ‘తుఫాన్ ’ ని, హిందీ వెర్షన్ ‘జంజీర్ ’ సెప్టెంబర్ 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు నిర్మాత.  కానీ సీమాంధ్రలో ఉద్యమం రోజు రోజుకు ఎక్కువవుతుండటంతో ఇప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా ? లేదా అనే సందేహాం నెలకొంది. ఒక ప్రాంతంలో ఆందోళనలు జరుగుతున్నంత మాత్రాన మొత్తం హిందీ వెర్షన్ ఆపేయడం అనేది నిర్మాతకు భారీ నష్టాన్ని కలిగించే విషయం. అదీ కాకుండా సెప్టెంబర్ 7వ తేదీన హైదరాబాద్ లో సీమాంధ్ర ప్రాంతం వారు, తెలంగాణ ప్రాంతం వారు పోటా పోటీ సభలు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు. దీని ప్రభావం కలెక్షన్ల పై పడుతుందని భావిస్తున్నారు చిత్ర యూనిట్. అందుకే, హిందీ వెర్షన్ ను విడుదల చేసేసి, తెలుగు వెర్షన్ ను ఆపడానికి నిర్మాత నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఆందోళనలు సద్దుమణిగాక 'తుఫాన్' ను విడుదల చేయాలనుకుంటున్నారట. ఇవన్నీ చూస్తుంటే చరణ్ కి రోజులు బాగా లేనట్లు అనిపిస్తుంది. ఏదైనా దోషం ఉంటే ఎవరికైనా చూపించుకొని పూజలు గట్రా చేసుకుంటే మంచిదని సూచిస్తారట ఆయన సన్నిహితులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles