Hansika telugu film to release in tamil

Hansika, Telugu film to release in Tamil, Hansika Telugu film to release in Tamil

Looks like Hansika is set to have a couple of releases in Tamil next month. While the buzz is that her film with Karthi is set to hit screens early next month, we hear that one of her Telugu films

హన్సిక పేరు చెప్పుకొని

Posted: 08/17/2013 07:12 PM IST
Hansika telugu film to release in tamil

‘చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మడం అంటే ఇదే ’. టాలీవుడ్ లో కాస్తో కూస్తో నేమూ, ఫేము ఉన్న హన్సికకు మాత్రం తమిళంలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఎంతగా ఉంటే.. గుడి కట్టి పూజించేంత. తమిళ జనాలు హన్సికను జూనియర్ కుష్బూగా అభివర్ణిస్తూ ఆరాధిస్తున్నారు. ఈమె నటించిన సినిమాలు తమిళంలో ఎలా ఉన్న కలెక్షన్లు మాత్రం ఫుల్. దీన్నే క్యాచ్ చేసుకొని క్యాష్ చేసుకోవడానికి సిద్ధం అయ్యారు నిర్మాతలు. అందులో భాగంగా గతంలో ఈ అమ్మడు నటించిన తెలుగు ఫ్లాప్ సినిమాలను బయటకు తీస్తున్నారు. గతంలో నితిన్ తో కలిసి ఈ చిన్నది 'సీతారాముల కల్యాణం లంకలో' అనే సినిమాలో నటించింది. అది పెద్ద ఫ్లాపు. అయినా సరే ఇప్పుడీ చిత్రాన్ని తమిళంలోకి డబ్ చేస్తున్నారు. తమిళంలో నితిన్ ఎవరికీ తెలియడు. కేవలం హన్సికకు వున్న డిమాండు వర్కౌట్ అవుతుందనే ఉద్దేశంతోనే ఈ చిత్రాన్ని తమిళనాట వదిలే ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం హన్సిక ఏ మాత్రం లాభాలు తెచ్చిపెడుతుందో దర్శకనిర్మాతలకు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles