Prabhas mirchi movie remake in bollywood

Prabhas Mirchi Movie Remake, prabhas, mirchi, mirchi hindi remake, prabhas, koratala siva, vamsi, pramod uppalapati, john abraham, rebel star

John Abraham will step into the shoes of Prabhas for the Hindi version. The Bollywood hunk, who is also a producer, has acquired the remake rights of the film from Telugu producers Vamsi and Pramod Uppalapati of UV Creations productions.

‘మిర్చి ’ ఘాటు బాలీవుడ్ లో

Posted: 07/25/2013 05:53 PM IST
Prabhas mirchi movie remake in bollywood

ఇటీవలి కాలంలో బాలీవుడ్ సినిమాలు టాలీవుడ్ లో, టాలీవుడ్ సినిమాలను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలు బాలీవుడ్ రీమేక్ లలో నటిస్తున్నారు. అటు బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోలు టాలీవుడ్ సినిమాలను రీమేక్ చేసి మంచి హిట్లు కూడా కొడుతున్నారు. ఇప్పుడు టాలీవుడ్ సినిమా ‘మిర్చి ’ ఘాటును చూడటానికి బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ఉత్సాహం చూపుతున్నాడు. టాలీవుడ్ రెబల్ స్టార్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘మిర్చి ’ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా మంచి వసూళ్ళను కూడా సాధించింది. దీంతో ఈ చిత్రం పై కన్నేసిన జాన్ ఈ రైట్స్ ని నిర్మాతల నుంచి రీసెంట్ గా కొనుకోలు చేసినట్లు వినికిడి. ఈ సినిమాను ఓ ప్రముఖ బాలీవుడ్ దర్శకడు చేతిలో పెట్టి రేమేక్ చేయనున్నట్లు సమాచారం. తెలుగులో  అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ లు హీరోయిన్లుగా నటించారు. మరి రీమేక్ లో వీరినే తీసుకుంటాడా లేక అక్కడి భామలతోనే లాగించేస్తాడా అనేది చూడాలి. ఈ సినిమా పై అంతగా ఆసక్తి చూపిస్తున్న జాన్ అబ్రహం కి అక్కడ కలెక్షన్ల ఘాటు చూపింస్తుందో లేదో చూడాలి. కొరటాల శివ మహేష్ సైతం సినిమా చేయనున్నాడని, దానికి ప్రిన్స్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles