Tamanna has no dates for new movies

Tamanna, Tamanna hot, Tamanna busy with movies, No dates for new movies, Tamanna bhatia, Tamanna dairy full

Tamanna has no dates for new movies

తమన్నా హౌజ్ ఫుల్ బోర్డు పెట్టింది

Posted: 07/25/2013 07:17 PM IST
Tamanna has no dates for new movies

టాలీవుడ్ మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న అందాల సుందరి తమన్నా హవా ఇటీవల కాస్తంతా తగ్గింది. ప్రస్తుతం నాలుగు సినిమాల్లో మాత్రమే బిజీగా ఉన్న ఈ అమ్మడు చిత్రాలు ప్రస్తుతానికైతే విడుదలకు సిద్ధంగా లేవు. ఏదో పాపం అందంగా ఉంటుంది కదా అని ఎవరైనా దర్శక నిర్మాతలు ఛాన్స్ ఇద్దామని వెళితే మాత్రం హౌజ్ ఫుల్ బోర్డు పెట్టింది. అర్థం కాలేదా డేట్స్ ఖాళీలేవు వెళ్ళమంటుందట. ప్రస్తుతం తెలుగు, తమిళం, మళయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నానని అవి పూర్తి కావాలంటే ఏడాది పడుతుందని, తన డేట్స్ ఇవ్వాలంటే మార్చి దాకా ఆగాలని చెప్పి పంపిస్తుందట. ఇటీవల ఈ అమ్మడు నటించిన సినిమాలు పెద్దగా ఆడకపోయే సరికి ఈమెకు అవకాశాలు కాస్త మందగించాయి. గతంలో ఒప్పుకున్న ప్రాజెక్టులు చేయంగా బోలెడంట టైం ఉన్నా కానీ అలా చెబితే తనకు డిమాండ్ తగ్గలేదని వారిని నమ్మించడానికే ఇలా చెబుతుందని అంటున్నారు. మరి అవకాశాలు వచ్చినప్పుడు వినియోగించుకోక పోతే ఆ తరువాత దిక్కులు చూడాల్సి వస్తుందా తమ్మూ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles