Radio mirchi music awards on the 26th july

Radio Mirchi Music Awards, Category Awards, D Suresh Babu, Ramana Gogula, Tanikella Bharani, Chandrabose, Mohan Krishna Indraganti, Kausalya

Radio Mirchi Music Awards on the 26th July ... The annual Radio Mirchi awards are to be presented this year in an event on the 26th July.

మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ చెన్నైలో

Posted: 07/13/2013 01:15 PM IST
Radio mirchi music awards on the 26th july

రేడియో శ్రోతలను నిత్యం మంచి మంచి పాటలతో రీఛార్జ్ చేస్తూ, ఉల్లాసాన్ని ఆనందాన్ని పంచుతున్న రేడియో మిర్చి గత నాలుగు సంవత్సరాల నుండి దక్షిణాది సినిమాల్లో వచ్చిన పాటల ఆధారంగా చేసుకొని ‘మిర్చి మ్యూజిక్ ’ అవార్డ్స్ ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రేడియో మిర్చి అవార్డ్స్ ని జూలై 26వ తేదీన చెన్నైలో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ అవార్డ్స్ ఎంపిక చేసేందుకు రేడియో మిర్చి భాషల వారిగా ప్రత్యేకంగా జ్యూరీ కమిటీని ఏర్పాటు చేశారు. మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి జ్యూరీ కమిటీ హైదరాబాద్ లో ప్రత్యేకంగా సమావేశం అయింది. ఈ సమావేశంలో జ్యూరీ సభ్యుడు డి. సురేష్ బాబు మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం లాగే నిష్పక్షపాతంగా అవార్డు గ్రహీతలను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. మొత్తం 122 సినిమాలు, 672 పాటలను పరిశీలించి ఐదుగురిని ఎంపిక చేసాం. ఆ విజేతలెవరన్నది ఈ నెల 26న జరిగే అవార్డుల వేడుకలో తెలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తనికెళ్ల భరణి, మోహన కృష్ణ ఇంద్రగంటి, హాసం రాజా, రమణ గోగుల, కౌసల్య, రామజోగయ్య శాస్త్రి, రేడియో మిర్చి సీఈఓ ప్రశాంత్ పాండే తదితరులు పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles