Pawan kalyan new movie teaser dialogues leaked

pawan kalyan new movie teaser dialogues leaked, Attarintikidaaredi movie teaser dialogues, attaraintiki daaredi movie trailer, attarintiki daaredi movie dialogues leaked, attarintiki daredi movie first look

pawan kalyan new movie teaser dialogues leaked, Attarintikidaaredi movie teaser dialogues, attaraintiki daaredi movie trailer, attarintiki daaredi movie dialogues leaked, attarintiki daredi movie first look

టీజర్ డైలాగులు లీకయ్యాయి

Posted: 07/13/2013 09:13 AM IST
Pawan kalyan new movie teaser dialogues leaked

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న తాజాగా చిత్రం ‘అత్తారింటికి దారేది ’ సినిమా విషయంలో రోజు రోజుకో సస్పెన్స్, రోజు రోజుకో న్యూస్ బయటకు వచ్చి హల్ చేస్తూ తెగ పబ్లిసిటీ చేసుకుంటుంది. ఇప్పటివరకు ఒక్క పోస్టర్, టీజర్, ట్రైలర్ కానీ విడుదల కాలేదు. ఇక ఆడియో విషయంలో కూడా ఇంకా క్లారిటీ రాలేదు. ఆడియో ఉంటుందని కొంతమంది, డైరెక్టుగా పాటల్ని మార్కెట్ లోకి విడుదల చేస్తారని కొంత మంది లేదు లేదు ఈనెల 14 ఆడియో ఉంటుందని మరి కొంత మంది... ఇలా ఎవరికి వారే తనకు తోచినట్లు మాట్లాడుకుంటున్నారు. ఇక నిన్నటి వరకు ఈ సినిమా ట్రైలర్స్ ని గోపిచంద్ సినిమా ‘సాహసం ’లో  ఇంటర్వెల్ అప్పుడు వేస్తారనే ప్రచార జరిగింది. కానీ నిన్న విడుదల అయిన ఆ సినిమాలో దీనికి సంబంధించిన ట్రైలర్స్ వేయలేదు. ఈ టీజర్ ని ని ఈనెల 21 అఫీషయల్ గా విడుదల చేయాలని ఆ చిత్ర యూనిట్ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కానీ అంతకన్నా ముందే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని డైలాగులు లీకై నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. గతంలో కూడా ఓ రెండు డైలాగులు లీక్ అయిన విషయం తెలిసిందే. తాజాగా లీకైన ఆ రెండు డైలాలుగులు ఏంటంటే...?

నోట్లో మాట... గన్ లో తూట వేస్ట్ గా వుండకూడదు... మాట జారినా తూటా పేలినా ప్రాణాలు పోతాయ్.

అరువు.... నీకు ఓపికున్నంత వరకు. నీ వాయిస్ లో బేస్ ఉన్నంత వరకు...
ఎగురు... నీ కాళ్ళలో సత్తువ ఉన్నంత వరకు. కానీ సూటిగా చూడకు...
స్ట్రైట్ గా రాకు... నా కళ్లలో ఉన్న పవర్ ని చూసి తట్టుకోలేవు.... నా రూట్ లో ఇమడ లేవు.

ఇలా ఒక్కో డైలాగ్ లీక్ అయిన తరువాత టీజర్స్ , ట్రైలర్స్ విడుదల చేస్తే ఈ సినిమాలో థ్రిల్ ఏముంటుంది... ఇప్పటికే పడాల్సిన బొక్కలు పడ్డాయని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles