Sunil bheemaneni coming together

sunil, bheemaneni, sundarapandian, allari naresh, sudigadu, tadakha, naga chaitanya

Comedy hero Sunil is getting ready to star in a Tamil remake. According to sources Bheemaneni Srinivasa Rao is planning to remake Tamil hit Sundarapandian..

భీమవరం బుల్లోడితో భీమినేని సినిమా

Posted: 07/04/2013 08:20 PM IST
Sunil bheemaneni coming together

కమేడియన్ నుండి పూర్తి స్థాయి హీరోగా మారిన సునీల్ చిన్న హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల ‘తఢాఖా ’ సినిమాతో తన తఢాఖా చూపించిన సునీల్ ప్రస్తుతం ‘భీమవరం బుల్లోడు ’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇది పూర్తి కాకముందే మరో సినిమాకు కమీట్ అయ్యాడని సమాచారం. తాజాగా తను తమిళంలో హిట్ అయిన ‘సుందర పాడ్యన్ ’ సినిమా రీమేక్ లో నటించాడానికి అంగీకరించాడు. ఈ సినిమాను ‘సుడిగాడు ’ దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ చిత్రాలతో పాటు లేడీ డైరక్టర్ బి.జయ దర్శకత్వంలో ఆయన హీరోగా చిత్రం త్వరలో తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంభందించి స్క్రిప్టు వర్క్ ఇప్పటికే పూర్తైందని సమాచారం. లవ్ లీ చిత్రం తో హిట్ కొట్టిన బి.జయ ఈ చిత్రాన్ని కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కించటానికి సన్నాహాలు చేస్తోందని సమచారం. అలాగే సునీల్ మరో కొత్త చిత్రం కమిటయ్యినట్లు సమాచారం. బిందాస్,రగడ చిత్రాల దర్శకుడు వీరూపోట్ల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి ' ఫ్రెండ్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. నల్లమలుపు బుజ్జి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక డి. సురేష్ బాబు నిర్మించే భీమవరం బుల్లోడు సినిమా ఆగష్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి సునీల్ బిజీ హీరోగా మారిపోయాడని చెప్పవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles