Anuskha in action scenes

anushka as rudramadevi, gunasekhar rudramadevi, mahesh babu, okkadu movie, sirivennela sitarama sastry

anuskha in action scenes

సాహసం చేసిన అనుష్క

Posted: 06/02/2013 02:12 PM IST
Anuskha in action scenes

గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్మస్తున్న రుద్రమదేవి చిత్రంలో రుద్రమదేవిగా నటిస్తున్న అనుష్క కొన్ని పోరాట సాహస దృశ్యాలలో డూప్ లేకుండా స్వయంగా నటించిందట. 

గత 30 రోజులుగా హైద్రాబాద్ లో సాగుతున్న చిత్ర నిర్మాణం గోపనపల్లి లో వేసిన భారీ సెట్టింగ్ లో జరిగింది.  రుద్రమదేవి చిత్రం కోసం వేసిన పెద్ద అరీనా సెట్టింగ్ లో పోరాట దృశ్యాలు, పాటలు, నృత్యాలు కొన్ని సంభాషణలతో కూడిన సన్నివేశాలను చిత్రీకరించామని చిత్ర నిర్మాణ బృందం తెలియజేసింది.

గుణ టీమ్ వర్క్ పతాకంలో గుణశేఖర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిన్న సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించిన గీతానికి భారీ ఎత్తున వందలాదిగా నృత్యకారులు, సహాయ నటులతో చిత్రీకరణ జరిగింది.  అది కాకుండా రాత్రి రాణి రుద్రమ దేవి పట్టాభిషేక మహోత్సవ సన్నివేశాన్ని చిత్రీకరించామని చెప్పారు. 

పాటలతో పాటుగా అదే సెట్ లో చేసిన పోరాట దృశ్యాలలో అనుష్క అత్యంత సాహసంతో తనే స్వయంగా నటించటాన్ని చిత్ర బృందం శ్లాఘిస్తూ తెలియజేసారు.   భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్టీరీయోస్కోప్ లో నిర్మిస్తున్న ఈ సినిమాలో గుణశేఖర్ ఎక్కడా రాజీ పడకుండా నిర్మాణాన్ని సాగిస్తున్నారని అన్నారు. 

ఇదే లొకేషన్ లో లోగడ ఒక్కడు సినిమా కోసం చార్మినార్ సెట్ ని వేసారు.  ఇక్కడ అరీనా సెట్ తో పాటుగా అన్నపూర్ణ స్టూడియోస్ లో వెయ్యి స్తంభాల గుడి, రంగ మండపాన్ని ఈ సినిమా కోసం నిర్మిస్తున్నారు.

ఐదు షెడ్యూల్స్ లో డిసెంబర్ కల్లా చిత్ర నిర్మాణం పూర్తవుతుందని చిత్రనిర్మాణ బృందం ఆశాభావాన్ని తెలియజేసారు.  ప్రస్తుతం జరుగుతున్నది మొదటి షెడ్యూల్.  ఇది ఇంకా మరో 10 రోజుల వరకూ సాగుతుందట.

-శ్రీజ

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles