Rajamouli clarifies rumors on baahubali

rajamouli, baahubali, Anushka, Hindi version, sonakshi simha

rumors have been swirling about possible changes in the female lead role for the Hindi version of Baahubali that Anushka.

సోనాక్షి కాదు-అనుష్కే

Posted: 06/01/2013 04:16 PM IST
Rajamouli clarifies rumors on baahubali

ప్రముఖ దర్శకుడు రాజమౌళి భారీ తారాగణంతో పాటు భారీ బడ్జెట్ తో రూపొందించబోతున్న ‘బహుబలి ’ సినిమా కు సంబంధించి ఏదో ఒక వార్త వెలువడటం, దాని పై చిత్ర యూనిట్ సభ్యులు గానీ, రాజమౌళి గాని స్పందించడం సర్వ సాదారణం అయిపోయింది. ఇటీవల ఈ సినిమా పై అనేక రూమర్లు రాగా తాజాగా ఈ సినిమా హిందీ వెర్షన్ లో హీరోయిన్ గా అనుష్కను తీసివేసి, సోనాక్షి సిన్హాను తీసుకోబోతున్నారని, దీనికి ఆమె నుండి సమాధానం రాలేదని వార్తలు వచ్చాయి. ఈ వార్తల పై రాజమౌళి ట్విట్టర్ లో స్పందించాడు. బాహుబలిలో సోనాక్షి నటించడం లేదని స్పష్టం చేసారు. అనుష్క లీడ్ హీరోయిన్ పాత్రకు ఖరారైందని, మరో హీరోయిన్ ఫైనలైజ్ కావాల్సి ఉందని తెలిపారు. అదే విధంగా తాను కూడా ఈ చిత్రంలో నటించడం లేదని, కేవలం దర్శకుడిగా నా పని తెర వెనక మాత్రమే అని స్పష్టం చేసారు. ఇప్పటికే ఇలాంటి వార్తలు వినివిని చిరాకెత్తిన జనాలు ఈ సినిమా పబ్లిసిటీ స్టంట్ కోసం వారు ఆడే నాటకమా లేక గాసిప్ రాయుళ్ళు పుట్టించే మాటలకు సినీ జనాలు బలై ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని అమోయమంలో పడిపోతున్నారని అంటున్నారు. మరి ఇప్పటికైనా ఈ సినిమా గురించి రూమర్లు అగుతాయో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles