Allu arjun iddarammayilatho audio launched

allu arjun, iddarammayilatho, amala paul, ram charan

Allu Arjun starrer Iddarammayilatho audio was released grandly in Hyderabad on 28th. Devi Sri Prasad composed music

‘ఇద్దరమ్మాయిలతో ’ ఆడియో హైలెట్స్

Posted: 04/29/2013 01:01 PM IST
Allu arjun iddarammayilatho audio launched

స్టైలిష్ స్టార్ అర్జున్ , ప్రముఖ దర్శకుడు అయిన పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న ‘ఇద్దరమ్మాయిలతో ’ సినిమా ఆడియో వేడుక నిన్న రాత్రి శిల్పకళా వేదికలో పలువురు సిని ప్రముఖుల సమక్షంలో అంగరంగా వైభవంగా జరిగింది. ఆ ఆడియో వేడుకకు దర్శకుడు వి.వి. వినాయన్, రామ్ చరణ్ , దిల్ రాజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ తన సంగీతంతో అభిమానులను అలరించాడు. ఈ ఆడియో విడుదల కార్యక్రమంలో హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ కాస్త ఉద్వేగంగా మాట్లాడాడు. మీరు (ఫ్యాన్స్) ఇంతగా మెగా ఫ్యామిలీ హీరోలను ఆదరించడం వల్లనే మేము ఇంత స్థాయికి వచ్చామని, ఇంతగా మాకు పేరు రావడానికి చిరంజీవి గారే కారణం.

ఆయన తరువాతి స్థానం రామ్ చరణ్ తేజదే అని, రాబోయే పాతికేళ్ళు చరణ్ బిజీ హీరోగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవీ ప్రసాద్ చక్కటి మ్యూ.జిక్ ఇచ్చాడని, పూరీ జగన్నాథ్ ఈ సినిమా కోసం చాలా శ్రమ పడ్డాడని 100 % ప్రేక్షకులకు నచ్చే చిత్రం అని అన్నాడు. క్రేజీ అనే పదానికి పూరి, బన్నీ నిర్వచనం. ఇప్పుడు వీరిద్దరితో పాటు దేవిశ్రీ అనే మూడో క్రేజీ చేరిపోయింది. ఈ కాంబినేషన్ బ్లాక్ బస్టర్ గా నిలవాలని కోరుకుంటున్నాను' అన్నారు. వినాయక్ మాట్లాడుతూ చాలా కాలం నుండి వీరి కాంబినేషన్లో  మరో సినిమా కోసం చూస్తున్నాను. అది ఇప్పుడు వస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. మొత్తానికి ఈ ఆడియో వేడుక సందడి సందడిగా జరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles