Trisha marriage with businessman

Trisha, heroine trisha, trisha marriage, trisha hyderabadi businessman, trisha dating, trisha gossip

Cine stars and heroine Trisha is no exception to it. In fact, she had been the centre of gossip on several occasions in the...

Trisha Marriage With Businessman.png

Posted: 03/14/2013 08:22 PM IST
Trisha marriage with businessman

trisha

ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన చెన్నై సుందరి త్రిషకు గత కొంత కాలంగా అవకాశాలు రావడం లేదు. దీంతో ఈ అమ్మడు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి గత కొంత కాలంగా వరుడ్ని వెతికే పనిలో పడిన విషయం తెలిసిందే. తాజాగా తమిళ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం త్రిష తల్లి ఉమా క్రిస్ణన్ త్రిషకు సరిపోయే ఓ వరుడ్ని వెతికిపెట్టిందట. అతడు సినిమా రంగానికి చెందిన వాడు మాత్రం కాదని సమాచారం. ఈ ఏడాదే ఆ మూడు ముళ్ల తంతు కానిచ్చేయాలని త్రిష తల్లి బావించి త్రిషను పెళ్లికి ఒప్పించే ప్రయత్నాల్లో ఉందట. ఇక త్రిష కూడా తల్లి మాట కాదనలేక కొత్త సినిమాలేవీ ఒప్పుకోవడంలేదట. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘రమ్ ’తో పాటు తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తుంది. దాదాపు ఆ పెళ్ళి ఫిక్స్ అయ్యిన కారణంగానే ఇటీవల కొన్ని చిత్రాలను తిరస్కరించారనే వార్త వినిపిస్తోంది. ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ, ప్రస్తుతం త్రిష మాత్రం విహార యాత్రలో ఉంది. రెండు వారాల పాటు ఈ యాత్రను ఎంజాయ్ చేసి, ఇండియా వచ్చిన తర్వాత దీని పై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చెన్నై చంద్రానికి పెళ్ళి జరిగితే వెండి తెరకు దూరం అవుతుందో లేక మిగతా హీరోయిన్ల లాగ అక్క, వదిన పాత్రల్లో కనిపిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dasari narayana satirical comments on chiranjeevi
Mahesh babu opens branch of rainbow hospitals  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles