Books on bollywood superstars amitab

books on bollywood superstars amitab..rushikapoor, shammi kapoor, manoj kumar

books on bollywood superstars amitab..

1.gif

Posted: 09/07/2012 01:14 PM IST
Books on bollywood superstars amitab

        పుస్తకప్రియులకు, చిత్రరంగంమీద మక్కువ కలవారికి ఇదో మంచి వార్త. ఇకమీదట బాలీవుడ్‌ ప్రముఖుల జీవితాలు పుస్తకరూపం amitab_fదాల్చబోతున్నాయి. వచ్చే ఏడాదిలో ఇవన్నీ మార్కెట్లోకి రానున్నాయి. అమితాబ్‌, రుషికపూర్‌, షమ్మీకపూర్‌, మనోజ్‌కుమార్‌, గురుదత్‌, శత్రుఘ్నసిన్హా, రజనీకాంత్‌, మణిరత్నం...జీవిత చరిత్రలు అభిమానుల్ని పలకరించనున్నాయి. ఇక మహ్మద్‌రఫీ జీవిత చరిత్రను ఆయన కొడుకు, సత్యజిత్‌ రే జీవిత చరిత్రను ఆయన భార్య బిజోరారు రాస్తున్నారు. అమితాబ్‌ విషయానికొస్తే...తన జీవిత కథలో తమ వంశ చరిత్ర అంతా వివరించనున్నారు. అలాగే ఐశ్వర్యరారు, అభిషేక్‌ బచ్చన్‌ ప్రస్తావన కూడా ఈ పుస్తకంలో rishi_eచోటు చేసుకోనుంది. ఇక ఈ జీవిత చరిత్రలో అమితాబ్‌ మనవరాలు ఆరాధ్య ఫోటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని తెలుస్తోంది. ఏదేమైనా బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమతో ముడిపడిన ప్రముఖుల జీవితాల గురించి తెలుసుకునే అవకాశం అభిమానులకు త్వరలో కలగనుంది. ప్రజల్లో పఠనాసక్తి తగ్గిపోతోన్న నేటి తరుణంలో సినీ ప్రముఖుల జీవిత కథాంశాలుగా రూపొందుతోన్న ఈ పుస్తకాలు ఎంతోకొంత పుస్తకాల వైపు చూచే ఆసక్తి కలిగిస్తాయనటం అతిశయోక్తికాదు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahesh venkatesh multistarer movie release
Actress sita lessions in hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles