Actress sita lessions in hyderabad

actress sita lessions in hyderabad, chaduvukovali movie shooting

actress sita lessions in hyderabad

5.gif

Posted: 09/07/2012 12:44 PM IST
Actress sita lessions in hyderabad

        చదువు ప్రాధాన్యత తెలియజేస్తూ విద్యార్థులు, యువకుల్లో చైతన్యం కలిగిలించే ‘చదువుకోవాలి’ చిత్రంలో టీచర్‌ గా దక్షిణాదికి చెందిన ప్రముఖ నటి సీత నటిస్తోంది. వపన్‌సాయి క్రియేషన్స్‌ పతాకంపై నిర్మితమవుతున్న చిత్రానికి మద్దాళి వెంకటేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్నారు. చదువు కోసం పరితపించే పాత్రలో నటిస్తున్న రాజన్న ఫేం ఆని ని చిత్రంలో ఉన్నతస్థాయికి తీసుకొచ్చే ప్రధానపాత్రలో సీత అద్భుతమైన నటన ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతంలో షూటింగ్‌ జరుపుకుంటోన్న చిత్రంలో పాఠశాల సన్నివేశాలతో పాటు బాలికను బడిలో చేర్పించే దృశ్యాలు, పిల్లలతో సన్నివేశాల చిత్రీకరణ  నిన్న జరిగింది.chadu_e
           ‘చదువుకోవాలి తల్లి... నా ముద్దుల చెల్లి... చదువుకుంటే విజ్ఞానం.. తొలుగుతుంది అజ్ఞానం..’ అంటూ ప్రముఖ గాయని సునీత ఆలపించిన పాటకు సీత, విద్యార్థులపై చిత్రీకరణ జరుగుతోంది. అలాగే ‘బంగారు గుడిలోన బహుచక్కగా ఉన్నాయి’.. ‘భక్త జనంతో వెలిగిపోతున్నావు.. విశాల నేత్రాలు ఉన్న వాడవు.. నల్లని దేహం కలవాడవు’ అంటూ శ్రీ వెంకటేశ్వరస్వామిని కీర్తించే పాటను సీతతో పాటు ఆనిపై చిత్రీకరించారు.. ‘చదువుకుంట నాన్న.. నేను చదువుకుంట నాన్న..’ అనే పాటను ఆని.. కోట శంకరరావుపై చిత్రీకరించారు. మరో పాట ‘పుట్టాలి ఇక్కడ గిట్టాలి ఇక్కడ పాటను..’ ఆనిపై చిత్రీకరణ జరిగింది.
       విద్యార్థులను మంచిగా తీర్చిదిద్దే పాత్రలో సీత నటిస్తున్నారు. చదువుపై నిర్లక్ష్యం చేయకుండా కాలేజీలకు డుమ్మా కొట్టకుండా, సమయాన్ని వృథా చేయకుండా చదువుపై దృష్టిపెడితే ఎలాంటి మంచి ఫలితాలు వస్తాయో చిత్రం తెలియచెబుతుంది.  శరవేగంగా షూటింగ్‌ సాగుతున్న ఈ చిత్రం త్వరలో పూర్తికానుంది. దసరాకు చిత్రాన్ని విడుదల చేస్తారు. కామెడీ సన్నివేశాల చిత్రీకరణ త్వరలో చేపడతామని దర్శకులు వెల్లడించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Books on bollywood superstars amitab
Hero rana gives up a holiday  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles