Nayana tara and tabu updates

nayana tara and tabu updates,

nayana tara and tabu updates

18.gif

Posted: 08/31/2012 07:57 PM IST
Nayana tara and tabu updates

      nayan_inn ప్రస్తుతం కోలీవుడ్ లో నయన్ గురించే ప్రథాన చర్చ జరుగుతోంది. ఎందుకంటు.. క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం సినిమాలో అవకాశం రాగానే ఏ ఆర్టిస్టయినా ఎగిరి గంతేస్తారు. కానీ నయనతార మాత్రం ఆయనకు 'నో' చెప్పేసింది. అందుకని. మణిరత్నం తాజాగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న 'కడల్' (తెలుగులో 'కడలి') సినిమాలో నయనతారకి ఓ పాత్ర ఆఫర్ చేశాడు. ఆమె కూడా ముందు ఉత్సాహం చూపింది. తీరా చూస్తే...  సీనియర్ నటుడు అర్జున్ సరసన వచ్చే పాత్ర అది. ఈ సినిమాలో అర్జున్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు, అందుకే ఆమె 'నో' చెప్పినట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే, వయసులో పెద్దవాడైన అర్జున్ పక్కన నటిస్తే, అది తను చేయబోయే తదుపరి చిత్రాలపై ప్రభావం చూపుతుందన్న ఉద్దేశంతో నయన్ 'నో' చెప్పినట్టు భోగట్టా.
  ఇక,  తెలుగులోని అగ్ర కథానాయకులందరితోనూ నటించి Tabu_Hot_1మెప్పించిన టబూ, తమిళ ... హిందీ భాషల్లో సైతం కథానాయికగా తన ప్రత్యేకతను చాటుకుంది. ఇక ఆమధ్య మలయాళంలో 'ఉరిమి' చిత్రంలో నటించిన ఆమె, తాజాగా మరో మలయాళ చిత్రాన్ని అంగీకరించింది. 'ఒరిస్సా' పేరుతో రూపొందుతోన్న ఈ సినిమా, సహజత్వానికి దగ్గరగా ఉండే కథా వస్తువుతో తెరకెక్కుతోంది. ఓ పల్లెటూరి పిల్లకి ... ఓ పోలీస్ ఆఫీసరుకి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంటుంది. ఆ విషయంలో తనకి ఎదురైన సమస్యలని ఓ టీచర్ ఇచ్చిన సూచనల ద్వారా ఆ పల్లె పిల్ల ఎదుర్కుంటూ ఉంటుంది. కథలో అత్యంత కీలకమైన ఆ టీచర్ పాత్రను టబూ పోషిస్తోంది. ఇంత వరకూ తాను ధరించిన విభిన్నమైన పాత్రల్లో ఇది ఒకటని టబూ చెబుతోంది. ఎం. పద్మకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jeeva mask movie review
Ok ok movie review hansika  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles