Ok ok movie review hansika

ok ok movie review hansika , udayanidhi stallen, director m ramesh, bellamkonda suresh producer

ok ok movie review hansika

15.gif

Posted: 08/31/2012 05:51 PM IST
Ok ok movie review hansika

ok_ok_innereee

సినిమా పేరు :      ‘ఓకే ఓకే’
విడుదల తేదీ:       31 ఆగష్టు 2012

దర్శకుడు :          ఎం. రాజేష్
నిర్మాత :            బెల్లంకొండ సురేష్
సంగీతం:            హరీష్ జైరాజ్
నటీనటులు :       ఉదయనిధి స్టాలిన్, హన్సిక

ఆంధ్రవిశేష్.కాం రేటింగ్ : 2.25

       ఇప్పటి వరకూ నిర్మాతగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ హీరోగా చేసిన తొలి మూవీ ‘ఓకే ఓకే’. రెడ్ జైంట్ మూవీస్ బ్యానర్ స్థాపించి ఘటికుడు, సెవెంత్ సెన్స్ వంటి సినిమాలు తీసిన ఈ యంగ్ హీరో ఓకే ఓకే అంటూ హీరోగా మారిపోయారు. తమిళ్లో 6 నెలల క్రితం విడుదలై హిట్ అయిన రొమాంటిక్ లవ్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఓకే ఓకే’ (ఒరు కల్ ఒరు కన్నాడి) సినిమాని తెలుగులో ఇవాళే విడుదల చేసారు. ఈ మూవీ తీరుతెన్నులు చూద్దాం..

స్టోరీ :
        ‘ఓకే ఓకే’ హీరో అమ్మాయిలకు సైట్ కొట్టడమే పనిగా పెట్టుకుంటాడు. శరణ్య, పెరుమాళ్ ఏకైక ముద్దుల కొడుకైన హీరో శ్రీనివాస్ (ఉధయనిది స్టాలిన్) అతని ఫ్రెండ్ బంగార్రాజు (సంతానం) ఇద్దరూ ఐనాక్స్ థియేటర్లో పని చేస్తూ సిగ్నల్ దగ్గర ఆగిన అమ్మాయిల్ని కామెంట్ చేస్తుంటారు.  ఈ క్రమంలో అలా ఒకరోజు సిగ్నల్ దగ్గర ఆగినపుడు మీరా (హన్సిక) ని చూసిన శ్రీనివాస్ ఆమె వెంటపడి ప్రేమించమంటాడు. హీరోయిన్ ఒక పోలీస్ ఆఫీసర్ కూతురు. హీరోయిన్ తన నాన్న పోలిస్ ఆఫీసర్ అని చెపుతుంది. అయినా సరే నేను ప్రేమిస్తున్నాను అంటాడు. పోలీస్ ఆఫీసర్ పిలిచి అతనికి క్లాస్ పీకినా కూడా మారడు. కనీసం మనిద్దరం స్నేహితులుగా అయినా ఉందాము అంటాడు. అలా చిన్న చిన్న మలుపులు తిరుగుతూ కథ నడుస్తుంది. హీరోయిన్ కు వేరే అబ్బాయితో పెళ్ళి నిశ్చయమౌతుంది. హీరో తన స్నేహితుడితో కలిసి పెళ్ళికి వెళతాడు. హీరోయిన్ ను పెళ్ళి చేసుకో బోయే వాడు ఇంకో అమ్మాయితో ప్రేమాణం నడిపిన చరిత్ర ఉంటుంది. హీరో ఈ పెళ్ళి ఎలా ఆపాలా అని ఆలోచిస్తున్న సమయంలో అథిది పాత్ర పోషించిన ఆర్య వచ్చి పెళ్ళికొడుకు మాజీ ప్రేమికురాలిని తీసుకుని వచ్చి వారిద్దరికి పెళ్ళి చేస్తాడు. దాంతో హీరోయిన్ హీరోను కలుస్తుంది. దాంతో శుభం కార్డు పడుతుంది.

విశ్లేషణ :    

        సినిమా గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సిందేమిటంటే.. హీరో క్యారెక్టరేజేషన్ లో అస్సలు క్లారిటీ లేదు. నిమిషానికో మాట మారుస్తుంటాడు. అక్కడక్కడా హీరో కంటే పక్కనున్న కమెడియన్ క్యారెక్టర్ చాలా తెలివైనదనిపిస్తుంది. అయితే సంతానం కామెడీ కొంతమేర వర్కవుట్ అయింది. ఫస్టాఫ్ వరకు సంతానం కామెడీతో ఇంటర్వెల్ వరకు బాగానే లాగినా, సెకండాఫ్ నుండి బోర్ కొట్టడం స్టార్ట్ అయింది. స్టాలిన్ లో హీరో మెటీరియల్ అస్సలు లేకపోయినా కామెడీతో మేనేజ్ చేద్దామని ట్రై చేసాడు కానీ తేలిపోయాడు. శ్రీనివాస్, మీరా మధ్య లవ్ ట్రాక్ ఏ మాత్రం ఆసక్తికరంగా లేదు. హన్సిక ఎప్పటిలాగే బొద్దుగా కన్పించినా... మంచి గ్లామర్ లుక్ లో కనువిందు చేసింది. హీరో ఉదయనిధి స్టాలిన్ యాక్టింగ్ లో ఇంకా మెచ్యూరిటీ లేదు. పేలవమైన నటన ప్రదర్శించాడు. ఫేస్ లో అసలు ఫీలింగ్సే లేవు. చివర్లో శ్రీనివాస్ ని కాదని వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిన మీరాకి శ్రీనివాస్ మీద మళ్లీ ప్రేమ పుట్టించే సన్నివేశాలు తేలిపోయాయి.
        ఇక సునీల్, రఘుబాబు, ఆహుతి ప్రసాద్, దర్మవరపు సుబ్రహ్మాణ్యం వంటి పలువురు నటీనటులతో డబ్బింగ్ చెప్పించారు. కమెడియన్ సంతానంకు సునీల్ తో వాయిస్ కాస్త ఊరట కల్గిస్తుంది. ‘గుండు కొట్టించుకునే వాడు... ఎండకోసమో, ఏడుకొండల వాడి కోసమో ఇట్టే కనిపెట్టెస్తా’ వంటి ఒకటి రెండు డైలాగ్స్ పేలాయి. నిర్మాత బెల్లంకొండ తమిల్ నేటివిటీ ఏమాత్రం కన్పించకుండా చేసేందుకు బాగానే ట్రై చేశాడు. తెలుగు హోర్డింగ్స్ దగ్గరనుంచి... వెహికిల్ నెంబర్స్ వరకు అన్నిట్లో శ్రద్ద తీసుకున్నారు.
    కాగా,  దర్శకుడు రాజేష్ కు ఇది మూడో చిత్రం. గతంలో శివ మనసులే శక్తి, బాస్ ఎంగిరన్ బాస్కరన్ వంటి చిత్రాలు రూపొందించాడు. అందులో ఒకటి ఎస్ఎమ్ఎస్ గా తెలుగులో రీమేక్ కాగా.... మరోటి నేనే అంబానీ పేరుతో డబ్బింగ్ అయ్యింది. తన గత చిత్రాల్లాగే ఇందులోనూ హీరోకు భారీ బిల్డప్ లివ్వకుండా సాదాసీదాగా ఓ మధ్యతరగతి కుటుంబం నేపధ్యంలో కథ నడిపించాడు. సినిమాకి కొంచెం ప్లస్ హారిస్ జైరాజ్ మ్యూజిక్. అఖిలా అఖిలా, జస్ట్ లైక్, అరెరే అరెరే పాటలు బావున్నాయి. నేపధ్య సంగీతం పర్వాలేదు. బాలసుబ్రమణ్యం సినిమాటోగ్రఫీ ఓకే.

బాటమ్ లైన్ :
సినిమా కెళ్లామా.. వచ్చామా.. ఇది అవసరమా... మీ ఇష్టం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nayana tara and tabu updates
Prabhas tamanna rebal movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles