King akkineni nagarjuna birthday

king akkineni nagarjuna birthday , 25 years in acting , vikram movie, trend setter in telugu film industry

king akkineni nagarjuna birthday

3.gif

Posted: 08/29/2012 12:45 PM IST
King akkineni nagarjuna birthday

       అమ్మాయిల కలల్లో నిత్యం కదిలే నవ మన్మథుడు.. పాతికేళ్లు పైబడ్డ నట ప్రస్థానంతో అందంగా అలరిస్తోన్న యువ సామ్రాట్.. మాస్ ని కేడీగా.. క్లాస్ ని అన్నయ్యగా అందరినీ షిరిడీసాయిగా ఆకట్టుకుంటోన్న విలక్షణ నటుడు అక్కినేని నాగార్జున. ఇవాళ ఆగష్టు 29 nag_ffffeee(బుధవారం) ఆయన పుట్టిన రోజు. నాగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.  తెలుగు తెరపై నాగ్ పేరు ఓ ట్రెండ్ సెట్టర్. డాన్స్ ... ఫైట్స్ ... కాస్ట్యూమ్స్ విషయంలో అప్పటి వరకూ కొనసాగుతోన్న విధానానికి వీడ్కోలు చెప్పి కొత్తదనానికి తెరతీసిన కథానాయకుడు. ఆకాశమంతటి అభినయాన్ని  ఆవిష్కరించిన అక్కినేనికి నట వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసి, తండ్రికి తగిన తనయుడు అనిపించుకున్న విలక్షణ కథానాయకుడాయన.
        లవ్ ... సెంటిమెంట్ ... యాక్షన్ ... కామెడీ ... రొమాంటిక్ చిత్రాలపై తనదైన ముద్ర వేసిన నాగార్జున, 'విక్రమ్' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. హిందీ సినిమా 'హీరో'కి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా యూత్ ను ఆకట్టుకోవడమే కాకుండా విజయాన్ని అందుకోగలిగింది.  ఇక 'మజ్ను' సినిమాలో పరిపూర్ణమైన నటన ప్రదర్శించారు. 'మజ్ను' అందించిన మరపురాని విజయం నాగార్జునని మరింత ఉత్సాహంగా ముందుకు నడిపించింది. ఆ తరువాత వచ్చిన 'కిరాయి దాదా' ... 'మురళీ కృష్ణుడు' ... 'జానకి రాముడు' ... ' ఆఖరి పోరాటం' చిత్రాలు నాగార్జున కెరియర్ కు బలమైన పునాదులు వేశాయి. నటుడిగా నాగార్జునలోని విభిన్న కోణాలను 'శివ', 'గీతాంజలి' చిత్రాలు అద్భుతంగా ఆవిష్కరించాయి. క్లాస్ చిత్రాల్లో నాగ్ మెప్పించలేడనే విమర్శను 'గీతాంజలి' తిప్పికొడితే, nagar_innereeఆయనలోని యాక్షన్ హీరోని ఎవరెస్ట్ స్థాయికి తీసుకెళ్ళింది 'శివ'. సంచలన విజయాలను సాధించిన ఈ రెండు సినిమాలు, నాగ్ కెరియర్ కి రెండు కళ్ళుగా ఉపయోగపడ్డాయని చెప్పొచ్చు. ఇక 'ప్రెసిడెంట్ గారి పెళ్ళాం' ... 'అల్లరి అల్లుడు' ... 'హలోబ్రదర్' ... 'ఆవిడా మా ఆవిడే' వంటి సినిమాలకు మాస్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాలతో ఆయన పూర్తి స్థాయి హాస్యాన్ని అందిస్తూ కామెడీపై తనదైన ముద్ర వేశారు.    'నిన్నే పెళ్ళాడుతా'.. ఈ సినిమా ఆయన కెరియరులో ఓ మరపురాని మధురమైన మజిలీగా చెప్పుకోవచ్చు. నాగార్జునలోని రొమాంటిక్ హీరోని కొత్త కోణంలో ఆవిష్కరించిన ఈ సినిమా, ఆ తరువాత ఆయన 'సంతోషం' ... 'మన్మధుడు' చిత్రాలు చేయడానికి మార్గాలు వేసింది. ఓ వైపున రొమాంటిక్ హీరోగా ... మరో వైపున 'మాస్' ... ' డాన్' వంటి సినిమాలతో యాక్షన్ హీరోగా ... ఇంకో వైపున 'అన్నమయ్య' ... 'శ్రీరామదాసు' వంటి భక్తిరస చిత్రాల్లో సైతం నటించి మెప్పించడం ఒక్క నాగార్జునకే సాధ్యమైందని చెప్పొచ్చు. damarukam_inerfff             

         తాజాగా,    'డమరుకం' ... 'శిరిడీసాయి' ... 'లవ్ స్టోరీ' చిత్రాలతో జనం గుండెల్లో జైత్ర యాత్రలు చేసేందుకు సిద్దంగా ఉన్నాడీ ఎవర్ గ్రీన్ యంగ్ హీరో.. అటు నాగార్జున నటించిన షిరిడిసాయి ఆడియో విజయోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.  మాదాపూర్ లోని ఎన్  కన్వెన్షన్  హాలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు సిని ప్రముఖులు హాజరయ్యారు. ఈ చిత్రంలో పనిచేసిన సిబ్బందికి గాయనీ గాయకులకు జ్ఞాపికలు అందజేశారు. పలువురు నాగార్జునకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేదికపై సంగీత దర్శకుడు కీరవాణి.. రాఘవేంద్రరావు మధ్య జరిగిన సంభాషణ ఆకట్టుకుంది. అన్ని పుట్టిన రోజుల్లోకెల్లా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్  బర్త్ డే అని నాగార్జున అన్నారు.
    భవిష్యత్ కాలంలోనూ ఇంకెన్నో అపురూప కళాకండాలు అక్కినేని నాగార్జున నుంచి రావాలని కోరుకుంటూ బర్త్ డే విషెస్ చెబుతోంది. ఆంధ్రవిశేష్.కాం. మీకోసం నాగ్ జన్మదిన స్పెషల్ సాంగ్.. ఇదిగో...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ever green dream girl hema malini
Pawanism baba sehgal song  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles