Allu arjun dream home and movie

allu arjun dream home and movie

allu arjun dream home and movie

22.gif

Posted: 08/28/2012 05:37 PM IST
Allu arjun dream home and movie

       అల్లు అర్జున్ ఎంతైనా.. స్టైలిష్ స్టార్ కదా.. బన్నీ ఏది చేసినా అది స్టైలిష్ గా ... లగ్జరీగా ఉంటుంది మరి.. స్టైలిష్ స్టార్ గా ఇంటా బయటా విజయాలు అందుకుంటోన్న బన్నీ, తన స్థాయికి తగినట్టుగా ఓ గెస్ట్ హౌస్ నిర్మించుకుంటున్నాడు. హైదరాబాద్- గచ్చిబౌలిలోని allu_arjuneeeeవిప్రో జంక్షన్ లో ఈ గెస్ట్ హౌస్ నిర్మాణం జరుగుతోంది. విశాలమైన స్విమ్మింగ్ పూల్ ... ఓపెన్ రూఫ్ బెడ్రూమ్ ... ఈ గెస్ట్ హౌస్ కి ప్రధాన ఆకర్షణ అని చెబుతున్నారు. ఇక బంధుమిత్రులతో కలిసి పార్టీలు గట్రా చేసుకోవడానికి వీలుగా ఓ అందమైన ప్రదేశాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రతిబింబించేలా తీర్చి దిద్దుతున్నారట. ఇందుకోసం కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్టు చెబుతున్నారు.
       ఇదిలా ఉండగా,  'జులాయి' సినిమా తెలుగులోనే కాకుండా మలయాళంలో కూడా 'గజపోకిరీ' రూపంలో ప్రేక్షకులను ఆకట్టుకుని, విజయం సాధించడంతో హీరో అల్లు అర్జున్ (బన్నీ) మంచి జోష్ మీద వున్నాడు. మలయాళం ప్రేక్షకులు తన మీద చూపిస్తున్న ఆదరణకు థ్రిల్లయిపోతున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడి అభిమానులను మరింతగా అలరించడానికి డైరెక్టుగా ఓ మలయాళ సినిమాలో నటించాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే, మంచి కథ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇదే చెబుతూ, 'మలయాళంలో స్ట్రెయిట్ సినిమా చేయాలని కోరికగా వుంది. మంచి కథ, అందుకు తగ్గా దర్శకుడు దొరికితే వెంటనే చేస్తాను. ఈ విషయంలో అభిమానుల కోరిక త్వరలోనే తీరుతుంది' అంటున్నాడు.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawanism baba sehgal song
Amala radhika life is beautiful movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles