అక్కినేని కుటుంబంలోని ముగ్గురు కథానాయకులైన నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందనీ ... ఆ సినిమా పేరు 'త్రయం' అని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇది కేవలం పుకారే నని ఇప్పుడు తేలిపోయింది. దీనిమీద కింగ్ నాగార్జున స్పష్టత ఇచ్చారు. అన్నపూర్ణ బ్యానర్లో తమ కాంబినేషన్లో సినిమా రానున్న మాట వాస్తవమేగానీ ... ఈ సినిమా పేరు 'త్రయం' అంటూ జరుగుతోన్న ప్రచారంలో ఏమాత్రం నిజంలేదని తేల్చి చెప్పారు. ఈ సినిమా టైటిల్ ను ఇంకా ఖరారు చేయలేదనీ ... అక్కినేని కుటుంబాన్ని ఆరాధించే అభిమానులందరికీ ఈ సినిమా సంతృప్తిని కలిగించేదిలా ఉంటుందని అన్నారు. తన సినిమాలు 'శిరిడీసాయి', 'డమరుకం' విడుదలకు ముస్తాబౌతుండగా, 'లవ్ స్టోరీ' చిత్రం షూటింగ్ దశలో ఉందని చెప్పారు. ఈ సినిమా తరువాత వీరభద్రం దర్శకత్వంలో 'భాయ్' చిత్రం, బెల్లంకొండ సురేష్ నిర్మాణంలో మరో సినిమా చేయనున్నట్లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, నాగార్జున, అనుష్క జంటగా నటించిన సోషియో ఫ్యాంటసీ చిత్రం 'డమరుకం' వైజాగ్ హక్కులను ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తీసుకున్నారు. 2 కోట్ల 25 లక్షల ఫ్యాన్సీ రేటు ఇచ్చారని ఆంధ్ర విశేష్ కు అందిన విశ్వసనీయ సమాచారం.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more