Actress januna birthday

Teluguwishesh Birthday Wishes To Actress Jamuna,Jamuna (born 30 August 1936) is a veteran Telugu actress,Actress Jamuna Photos, Jamuna Photos, Actress Jamuna, Jamuna Stills, Jamuna

Teluguwishesh Birthday Wishes To Actress Jamuna

Jamuna.gif

Posted: 08/27/2012 01:42 PM IST
Actress januna birthday

Teluguwishesh Birthday Wishes To Actress Jamuna

తెలుగు సిని పరిశ్రమ కు రెండు కళ్ళు యన్. టీ. ఆర్., ఏ. యన్. ఆర్., అంటారు... కధానాయికలలో, మహానటి సావిత్రి గారితో పాటు హోదా ని చేరుకుంది, నిస్సందేహంగా, అలనాటి మేటి హీరోయిన్ జమున గారే... అందానికి, అభినయానికి, చక్కని కను ముక్కు తీరు కి, హుండ తరహా నటనకి, నడత కి, కాస్తంత గర్వం ఒత్తిపతే పాత్రలు పోషించడానికి జమున గారు పెట్టింది పేరు... నేటికి, పురుశాదిఖ్య పరిశ్రమగా పేరు ఉన్న తెలుగు సిని పరిశ్రమ లో, నిర్విరామంగా 25 సంవత్సరాల పాటు అగ్ర కథానాయికగా కొనసాగిన ఘనత నటిమణిది...

జమున గారి నటన తెలుసుకోవాలంటే, రాము, గుండమ్మ కథ, మిస్సమ్మ, శ్రీ కృష్ణ పాండవీయం, మూగ మనసులు, మంగమ్మ శపధం, ఇలా చెప్పుకుంటూపొతే ఎన్నో ఉదాహరణలు... తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్ర సీమలలో, 145 చిత్రాలకు పైగా నటించిన కీర్తి జమున గారి సొంతం. తాను నటి గా తొలి విజయం అందుకున్న ఇల్లరికం చిత్రం నుండి, తన చివరి చిత్రం వరకు, ఎన్నో విలక్షణమైన పాత్రలను అవలీలగా పోషించిన ఘనత జమున గారికి దక్కుతుంది...

కర్ణాటక లో జన్మించి, గుంటూరు లో విద్య, నాట్యం అభ్యసించిన జమున గారికి, తన 13 ఏట ఒకానొక సంమాన్ సభలో పాట పాడే అవకాశం దక్కిని... సమయం లో ప్రముఖ హాస్య నటులు, జమున గారు నటనలో ప్రవేశిస్తే ఉత్తమం అని తలచి, ఒకానొక సిని నిర్మాతకు, జమున గారి పేరుని సూచించారట... అలా, జమున గారి సిని ప్రస్తానం ప్రారంభం అయ్యింది... అయితే కొన్ని కారణాల వల్ల తన తొలి చిత్రం నిర్మాణ దశలోనే ఆగిపోయింది. అటువంటి తరుణం లో ప్రముఖ నిర్మాత కే. వి. రెడ్డి గారు, 'వద్దంటే డబ్బు' చిత్రం లో జమున గారికి అవకాశం ఇచ్చారు... చిత్రం కూడా, ఆశించిన విజయం సాధించలేకపోయింది... తొలి నాల్ల లో జమున గారికి 'తను సినిమా లో నటిస్తే, సినిమా అపజయం పాలవ్వడం ఖాయం' అన్న అపకీర్తి ముద్రపడిపోయింది...

Teluguwishesh Birthday Wishes To Actress Jamuna

అయితే 'ఇల్లరికం' చిత్రం తో విజయాన్ని మూట గట్టుకున్న జమున గారు, ఇక వెనక్కు తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది...

కధానాయకులతో సమానంగా పాత్రలు పోషించడం లో జమున గారు దిట్ట... ఎన్నో నాయికా ప్రధానమైన చిత్రాలలో జమున గారు నటించి మెప్పింహ్చారు... ఇటువంటి తరుణంలో, పరిశ్రమకు రెండు కళ్ళుగా పేర్కున్న, యన్. టీ. ఆర్., ఏ. యన్. ఆర్., జమున గారితో తాము నటించం అని తేల్చి చెప్పేశారు... షూటింగ్ లొకేషన్ కు ఆలస్యంగా రావడం, తోటి నటుల ముందు, కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం, అహంగా ప్రవర్తించడం జమున గారిని ఇద్దరు హీరోలు తమతో నటించడానికి దూరం చేసే విధంగా చేసాయి, అని ఇప్పటికీ ఎందరో మహామహులు చెబుతూ ఉంటారు... అయితే, విజయ సంస్థ వారి 'గుండమ్మ కథ' తో పరిస్తితులు చక్కబడి, ఇద్దరు హీరోలతో జమున గారు నటించడం మళ్లీ ప్రారంభం అయ్యింది.

అటు నటనని, ఇటు కుటుంబ జీవితాన్ని సమన్వయము చేసుకున్న అతి కొద్దిమంది నటీమణులలో, జమున గారు కూడా ఒక్కరు. అన్నేళ్ళు అగ్ర కధానాయికగా కొనసాగిన, తన కుటుంబ జీవితాన్ని కూడా అంటే అందంగా తీర్చిదిద్దుకున్నారని ప్రతీతి.

Teluguwishesh Birthday Wishes To Actress Jamuna

తన నటనలో అటు విలక్షణ స్వభావాలు పలికించడమే కాకుండా, ఒక పల్లెటూరి కొంటె పిల్ల తరహా పాత్రలు పోషించడంలో కూడా జమున గారు దిట్ట... 'నిలువవే వాలు కనులదానా', 'చెట్టులెక్కగలవా'... వంటి పాటలు రాసిన రచయితలు, జమునగారిని దృష్టి లో పెట్టుకునే పాటలు రాసార అన్నంత అతికినట్టు, జమున గారు ఇటువంటి ఎన్నో పాటలలో, చిత్రాలలో నటించి, అందరి మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నారు...

విలక్షణ నటీమణి, నెల 30 తన పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు... సందర్భంగా నటి తెలుగు సిని పరిశ్రమకు అందించిన సేవను కొంతయిన వివరించే ప్రయత్నం చేసింది ఆంధ్రవిశేష్ బృందం...

సునయన వినయ్ కుమార్


 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Murugudas tupaki movie telugu rights
Famous artist ak hangal dead  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles