Ice ice new love story movie starts in vijayanagaram

ice ice new love story movie starts in vijayanagaram

ice ice new love story movie starts in vijayanagaram

14.gif

Posted: 08/20/2012 06:21 PM IST
Ice ice new love story movie starts in vijayanagaram

       కె కెమూవీస్‌ పతాకంపై గ్రామీణ వాతావరణం నేపథ్యంలో యూత్‌ లవ్‌స్టోరీ 'ఐస్‌..ఐస్‌..' అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశం విజయనగరం టౌన్‌ సెంటర్‌ లే-అవుట్‌లో వద్దగల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ice_innప్రారంభమైంది. జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు కోలగట్ల వీరభద్రస్వామి ముహూర్తపు క్లాప్‌ కొట్టారు. అంతా కొత్త నటీనటులతో ఈ చిత్రం నిర్మితమౌతోంది. నిర్మాత బొద్దుల నర్సింగరావు మాట్లాడుతూ తక్కువ బడ్జెట్‌లో నూతన నటీనటులు కృష్ణతేజ, రేఖలను హీరోహీరోయిన్లుగా వెండి తెరకు పరిచయం చేస్తూ యువ దర్శకులు జయసింహ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ పరిశ్రమకు తాను కొత్త అయినప్పటికీ యువతీ యువకులతో కూడిన 'ఐస్‌..ఐస్‌..' చిత్రం యూనిట్‌ బృందాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా నిర్మాణానికి ముందుకు వచ్చానని చెప్పారు.
         డైరెక్టర్‌ జయసింహ మాట్లాడుతూ ఇది కూల్‌ లవ్‌స్టోరీ చిత్రమన్నారు. పల్లె వాతావరణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందన్నారు. మురళి లియాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారని, ఆరు పాటలుంటాయన్నారు. హీరో కృష్ణతేజ మాట్లాడుతూ గత పదేళ్లుగా సినిమా రంగంలో ఉన్నానని, యాక్టింగ్‌లో మెళకువలు తెలుసుకున్నానని, శిక్షణ కూడా పొందానని చెప్పారు. హీరోయిన్‌ రేఖ కొత్త అమ్మాయి అయినా నటనలో శిక్షణ పొందిందని చెప్పారు. టాకీ పార్టు విజయనగరంలో చిత్రీకరిస్తామని, పాటలు అరకు, రాజస్థాన్‌లో చిత్రీకరిస్తామని వెల్లడించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Love story new telugu movie with fresh cast
Young tiger another movie janaganama  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles