Doola sinu new telugu movie

doola sinu new telugu movie

doola sinu new telugu movie

3.gif

Posted: 08/03/2012 01:46 PM IST
Doola sinu new telugu movie

      రాను రాను సినిమా టైటిల్స్ వింతగా విడ్డూరంగానూ తయారవుతున్నాయి. తాజాగా థర్మపథ క్రియేషన్స్‌ పతాకం పై రాజ్‌ కందుకూరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రానికి 'దూల శీను' పేరు పెట్టారు. 'ఈరోజుల్లో' ఫేమ్‌ శ్రీ, తషు కౌశిక్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రం dula-seenu_innమొదటి షెడ్యూల్‌ నాన్‌స్టాప్‌గా 28 రోజులు జరిగింది. ఇప్పటికి డెభ్బై శాతం టాకీ, రెండు పాటలు చిత్రీకరణ పూర్తయింది. ఈనెలలో జరిగే 12 రోజుల షెడ్యూల్‌తో షూటింగ్‌ పూర్తవుతుంది. రొమాన్స్‌, కామెడీ ప్రధా నాంశంగా రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్‌ నుండి ఎండ్‌ కార్డ్‌ వరకూ పూర్తి వినోద భరితంగా వుంటుందనీ, నవంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయనున్నా మని రాజ్‌ కందుకూరి అంటున్నారు.
       నిన్న అన్నపూర్ణ స్టూడియోలో మండువా లోగిలిలో జరిగిన సీతారామశాస్త్రి రాసిన 'సింహాలై గర్జిద్దాం. సంహారం సాగిద్దాం..' అనే పాట చిత్రీకరణలో ఈ చిత్రం లోని ప్రధాన తారాగణమంతా పాల్గొన్నారు. సినిమా గురించి హీరో శ్రీ మాట్లాడుతూ, ఇది ఔట్‌ అండ్‌ ఔట్‌ కామెడీ చిత్రం. చాలా సింపుల్‌ లైన్‌. ఈరోజుల్లో తర్వాత మంచి పేరు వస్తుందనే నమ్మకముందని చెప్పారు. తషుకౌశిక్‌ మాట్లాడుతూ మంచి కథతోకూడిన చిత్రంలో నటించడం ఆనందంగా వుందన్నారు.
         ఇంకా ఈ చిత్రంలో జీవా, గిరిబాబు, శ్రీలక్ష్మి, రజిత, సుమణ్‌శెట్టి, పృథ్వీ, గుండు సుదర్శన్‌ తదితరులు నటిస్తున్నారు. కెమెరా: మురళీ వై.నిర్మాత, దర్శకత్వం: రాజ్‌ కందుకూరి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sagara sangamam with ntr
New movie nirantaram nee uhale audio release  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles