New movie nirantaram nee uhale audio release

new movie nirantaram nee uhale audio release

new movie nirantaram nee uhale audio release

55.gif

Posted: 08/03/2012 01:37 PM IST
New movie nirantaram nee uhale audio release

      niran_f ఆర్‌ఎస్‌ ఇన్‌ఫోటైన్‌మెంట్‌ బేనర్‌పై ఎల్రెడ్‌కుమార్‌ దర్శకత్వంలో తమిళంలో హిట్‌ అయిన ఓ చిత్రాన్ని మెగా సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ సమర్పణలో ఎల్రెడ్‌కుమార్‌, జయరామరెడ్డిలు 'నిరంతరం నీ ఊహలే' పేరుతో తెలుగులో అనువదిస్తున్నారు. అథర్వా మురళి, అమలాపాల్‌ జంటగా నటిస్తున్నారు. జివి ప్రకాష్‌ సంగీతాన్ని అందించారు. ఈ ఆడియో రాత్రి హైదరాబాద్‌లో విడులైంది. వర్థమాన హీరో నాని ఆడియోను విడుదలచేసి మరో హీరో సునీల్‌కు అందించారు.
      ఈ సందర్భంగా చిత్రం బ్రుందంతోపాటు పలువురు తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. హీరో నాని మాట్లాడుతూ నాకు ఇష్టమైన బేనర్‌ సూపర్‌గుడ్‌. 'భీమిలి కబడ్డీ జట్టు' వంటి హిట్‌ చిత్రాన్ని ఇచ్చారు. ఈ సినిమాలో ట్రైలర్స్‌, సాంగ్స్‌ సూపర్బ్‌ గా ఉన్నాయి. జెండాపై కపిరాజు అనే నా చిత్రానికి కూడా ప్రకాష్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ పాటలు విన్నాక మంచి సంగీతం ఇస్తారని నమ్మకం కల్గిందని చెప్పారు. సంగీతదర్శకుడు ప్రకాష్‌ మాట్లాడుతూ, వనమాలి సాహిత్యంతో పాటలన్నీ బాగున్నాయి. రీరికార్డింగ్‌ బాగా కుదిరింది. మంచి సక్సెస్‌కావాలని కోరుకుంటున్నానని అన్నారు. niran_inner
        సునీల్‌ మాట్లాడుతూ, ఈ సినిమాలో పాటలతోపాటు హీరో అథర్వా మురళి డాన్స్‌ అద్భుతంగాఉంది. తెలుగు పరిశ్రమలో అతనికి మంచి స్థానం ఏర్పడుతుందని అన్నారు. హీరో మురళి మాట్లాడుతూ హీరోగా నాకిది రెండవ చిత్రం. జీవీ ప్రకాష్‌ చక్కటి సంగీతం ఇచ్చారు. మెగా సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదలచేయడం ఆనందంగా ఉంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ, మా బేనర్‌లో వచ్చిన రంగం చిత్రాన్ని ఆర్‌బి చౌదరి తెలుగులో విడుదలచేశారు. ఈ చిత్రం కూడా అదే బేనర్‌లో విడుదల కావడం ఆనందంగా ఉంది. ఈచిత్రానికి సంగీతం బ్యాక్‌బోన్‌గా నిలుస్తుంది. తమిళ వర్షన్‌కు, తెలుగుకు స్క్రీన్‌ప్లే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక్కడా మంచి హిట్‌ అవుతుందనే నమ్మకముందని తెలిపారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Doola sinu new telugu movie
Sneha ullal port stills  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles