Ramcharan gift to upasana

ramcharan gift to upasana

ramcharan gift to upasana

29.gif

Posted: 07/30/2012 07:32 PM IST
Ramcharan gift to upasana

       ఈ ఏడాది మేటి పెళ్లిగా భావిస్తోన్న వివాహం చరణ్ – ఉపాసనలది. అయితే రాంచరణ్ భార్య ఉపాసన జూలై 20 న తన పుట్టినరోజు వేడుకను జరుపుకుంది. తమ వివాహం జరిగాక వచ్చిన తొలి పుట్టినరోజు కావడంతో, ఆమె కోసం చరణ్ విదేశాల నుంచి అరుదైన కానుకనుramcha తెప్పించాడు. చరణ్ కీ ... ఉపాసనకి మేలు జాతి గుర్రాలంటే ఎంతో ఇష్టమనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చరణ్ తన భార్య పుట్టిన రోజు కానుకగా మినియేచర్ జాతికి చెందిన ఓ గుర్రాన్ని ఐర్లాండ్ నుంచి తెప్పించాడు. 14 - 15 ఏళ్లపాటు జీవించే ఈ గుర్రం కేవలం 31 అంగుళాల వరకూ మాత్రమే పెరుగుతుంది. ముద్దుగా ... ముచ్చటగా కనిపించే ఈ గుర్రం ఉపాసనకి ఎంతగానో నచ్చిందనీ, ఆమె సంతోషం చూశాక ఆ గుర్రం కోసం తాను పడిన శ్రమ మరిచిపోయానని చరణ్ చెప్పాడు. ఏ డైమండ్ నేక్లేసో ... ఖరీదైన కారో తీసుకువచ్చినా ఆమె ఇంతగా సంబరపడేదికాదని అన్నాడు. ఇలాంటి అపురూపమైన కానుకని ఇంతవరకూ అందుకోలేదని ఉపాసన అనడం తనకి ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పాడు. ఈ గుర్రానికి ఎయిర్ కండీషనర్ తో కూడిన షెల్టర్ ని నిర్మించడానికి తన తల్లి కూడా అంగీకరించిందని చరణ్ అన్నాడు. ఏదేవైనా ఈ గుర్రం రాకతో తమ ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయిందంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇంకేంటి ఇక ఆ మూగ జీవి పంట పండిందన్నమాటే..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan make chiru birthday celebrations
Film chamber elections  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles