Film chamber elections

film chamber elections

film chamber elections

37.gif

Posted: 07/30/2012 07:24 PM IST
Film chamber elections

       ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్యమండలి (ఫిల్మ్ చాంబర్) నూతన అధ్యక్షునిగా సీనియర్ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఎంపికయ్యారు. చాంబర్‌కు అనుబంధంగా ఉన్న నాలుగు సెక్టార్లలో ఈసారి అధ్యక్ష పదవి నిర్మాతల సెక్టార్‌కు దక్కింది. ఈ సెక్టార్ కార్యవర్గానికి జరిగిన ఎన్నికల్లో 12 మందికి గాను భరద్వాజ ప్యానల్‌కు చెందిన 11 మంది జయకేతనం ఎగరవేశారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌చాంబర్ భవనంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికల అధికారి ఐ. సుజాత ఆధ్వర్యంలో పోలింగ్ జరిగింది.  jeevithaస్టూడియో సెక్టార్ కార్యవర్గం ఏకగ్రీవం కావడంతో ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సెక్టార్లకు ఎన్నికలు జరిగాయి.వీటి కార్యవర్గాల ఎన్నిక జరిగాక ఫిల్మ్‌చాంబర్ కార్యవర్గం ఎంపిక సందర్భంగా చాలాసేపు హైడ్రామా నడిచింది. స్రవంతి రవికిశోర్, సి. కల్యాణ్ లకు చెందిన 'యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ప్యానల్' నుంచి ప్రొడ్యూసర్ల సెక్టార్‌లో కార్యవర్గానికి ఎంపికైన ఏకైక సభ్యుడు కె. అశోక్‌కుమార్‌ను చాంబర్ అధ్యక్షునిగా చేయాలంటూ మంతనాలు జరిగాయి. చివరకు భరద్వాజ అధ్యక్షుడిగా ఎంపికైనట్లు చాంబర్ పూర్వ అధ్యక్షుడు డి.సురేశ్‌బాబు ప్రకటించారు. అశోక్‌కుమార్‌ను కార్యదర్శిగా ఎన్నుకున్నారు. చాంబర్ చరిత్రలోనే పోటీలో పాల్గొన్న తొలి మహిళగా గుర్తింపు పొందిన జీవిత సైతం సంయుక్త కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఉపాధ్యక్షులుగా నాగినీడు, వి. వీరినాయుడు, మల్లేష్‌యాదవ్, కార్యదర్శులుగా అశోక్‌కుమార్, భూపాల్‌ప్రసాద్, సంయుక్త కార్యదర్శులుగా జీవిత, వి. నాగేశ్వరరావు, దేవీప్రసాద్, మహేశ్వర్‌రెడ్డి, వంశీకిశోర్, కె. లక్ష్మణరావు, కోశాధికారిగా వై. విజేందర్‌రెడ్డి ఎంపికయ్యారు. అలాగే ప్రొడ్యూసర్ల సెక్టార్ చైర్మన్‌గా నట్టి కుమార్, డిస్ట్రిబ్యూట్ల సెక్టార్ చైర్మన్‌గా భరత్‌చౌదరి, ఎగ్జిబిటర్ల సెక్టార్ చైర్మన్‌గా వి. పురందర్, స్టూడియో సెక్టార్ చైర్మన్‌గా పి. కిరణ్ ఎంపికయ్యారు. ఈ ఎన్నికలలో సొంత నిర్మాణ సంస్థలున్న నందమూరి, అక్కినేని, ఘట్టమనేని కుటుంబాల నుంచి ఓటు వేయడానికి ఎవరూ రాలేదు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramcharan gift to upasana
Ukodatara ulikkipadatara movie review  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles