Ukodatara ulikkipadatara movie review

ukodatara ulikkipadatara movie review

ukodatara ulikkipadatara movie review

31.gif

Posted: 07/28/2012 04:21 PM IST
Ukodatara ulikkipadatara movie review

balayya

31

 

విడుదల తేది : 27 జూలై 2012 దర్శకుడు : శేఖర్ రాజ
నిర్మాత : లక్ష్మి ప్రసన్న మంచు
సంగీత దర్శకుడు: బోబో శశి
తారాగణం : మనోజ్ మంచు, బాలకృష్ణ, లక్ష్మి ప్రసన్న

ఆంధ్రావిశేష్.కాం రేటింగ్ : 2.00

కథ గురించి క్లుప్తంగా :

     గంధర్వ మహల్ అనే మహా కట్టడాన్ని కాపాడ్డానికి ఇద్దరు హీరోలు వేర్వేరు కాలాల్లో చేసే పోరాటమే ఊ కొడతారా ఉలిక్కిపడతారా సినిమా కథ. ట్రైలర్లలో మనోజ్ విన్యాసాలు, గెటప్పులు చూసి.. ఏదో అద్భుతం చూడబోతున్నాయన్న భ్రమలు ఈ సినిమా చూసాక తొలగిపోతాయి. ఇంకా.. హీరో.. చుట్టూ ఉన్న కమెడియన్లను భ్రమింపజేసేందుకు ఆడే చిన్న డ్రామా లాంటి సాంగ్. ‘నా ఊహ ఉన్మాదం.. నా కోరిక క్రూరం.. నేనంటేనే మరణం’ అంటూ చెప్పే డైలాగ్ కూడా కామెడీ కోసమే. సినిమా మొదలైన 20 నిమిషాల్లోనే.. ‘మనోజ్ కు అంత సీన్ లేదు’ అన్న విషయం తేలిపోవడంతోనే ప్రేక్షకుడి ఆసక్తి సగం చల్లారుతుంది. బాలయ్య కొన్ని సన్నివేశాల్లో ఆయన చాలా ఎమోషనల్ గా నటించినా.. సన్నివేశాల్లో బలం లేక కుదర్లేదు. మనోజ్ తన ‘కలల చిత్రం’లో చాలా పరిమితులున్న పాత్ర పోషించాడు. అతనికంటూ ఐడెంటెటీనే లేకపోయింది.  మంచు లక్ష్మి క్లైమాక్స్ లో రెండు మూడు నిమిషాలు అదిరిపోయే నటనతో ఆకట్టుకుంది. కానీ ముసలి క్యారెక్టర్లో ఆమెకు వేసిన మేకప్ మాత్రం భరించలేం. అసలామె పాత్రే పెద్ద గందరగోళంగా తయారైంది. ఇంతకీ ఆమె పాత్ర పాజిటివా.. నెగిటివా కూడా అర్థం కాదు. ఫణీంద్ర భూపతిగా సోనూసూద్ చేసిన పాత్రలో అరుంధతి సినిమాలోని పశుపతి పాత్ర తాలూకు షేడ్స్ కనిపిస్తాయి. సాయి కుమార్ చిన్న పాత్రే అయిన బాగానే చేసాడు. చివర్లో అజయ్ మాంత్రికుడుగా కనిపించాడు. రాయుడు పాత్రలో ప్రభు, శేషయ్యగా భానుచందర్ కూడా పర్వాలేదనిపించారు. సుహాసిని, గొల్లపూడి, మారుతీ రావు, ప్రభ, రాజా రవీంద్ర, రిషి ఇలా అందరు పాత్ర పరిధిమేరకు నటించారు.
అనుకూలాంశాలు :
        బాలయ్య ఎమోషనల్ నటన, బ్యాగ్రౌండ్ స్కోర్, మంచు లక్ష్మి క్లైమాక్స్ లో రెండు మూడు నిమిషాలు అదిరిపోయే నటన.
ప్రతికూలాంశాలు :
       ఆసక్తి సన్నివేశాలతో ప్రధాన పాత్రల ఔచిత్యం కూడా దెబ్బతింది, సినిమాకు పోలిక పెట్టే ఒక్క సన్నివేశమూ ఇందులో లేదు, సన్నివేశాల్లో బలం లేదు సన్నివేశాల్ని పేర్చేసి మమ అనిపించేశారు. ముగింపు పర్లేదనిపించడంతో సినిమా ‘ఏవరేజ్’గా బయటపడింది. ఇంతకీ సినిమాకు ‘ఊ కొడతారా ఉలిక్కిపడతారా’ టైటిల్ ఎందుకు పెట్టారన్నది మాత్రం అర్థం కాలేదు. ఇంకా.. సినిమా ప్రారంభంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రఘు బాబు, అభినయశ్రిలతో చేసిన కామెడీ ఆకట్టుకోలేకపోయింది. దాదాపు సినిమా మొదటి భాగం అంత కథ ముందుకి సాగకపోవడంతో సహనాన్ని పరీక్షిస్తుంది. బోబో శశి సంగీతంలో వచ్చిన అబ్బబ్బ అబ్బబ్బ, ప్రతి క్షణం నరకమే పాటల చిత్రీకరణ కూడా అస్సలు ఆకట్టుకోలేదు. ఈ సినిమా టైటిల్ కి సినిమాకి పొంతన కుదరక పోవడం గమనార్హం. మనోజ్, దీక్షా సేథ్ మధ్య రొమాంటిక్ ట్రాక్ కూడా సరిగా పండలేదు.
సాంకేతిక విభాగం :
      మొదటగా చెప్పుకోవాల్సింది ఆర్ట్ డైరెక్టర్ భూపేష్ గురించి. 6 కోట్లు వెచ్చించి నిర్మించిన గంధర్వ మహల్ సెట్ చాలా బావుంది. సినిమా అంతా దాదాపు గంధర్వ మహల్లోనే తీసారు. గతంలో సింహా సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన చిన్న ఈ సినిమాకి కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. క్లైమాక్స్ సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా హెల్ప్ అయింది. సినిమా మొదటి భాగంలో కొత్త వరకు ఎడిట్ చేస్తే బావుండేది. బి. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి కొంతమేర హెల్ప్ అయింది.
ముగింపు :
       ‘ఊ కొడతారా ఉలిక్కిపడతారా’ ప్రేక్షకులు కోరుకున్న స్థాయిలో హిట్టిచ్చే అవకాశాలు తక్కువే.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Film chamber elections
A movie on ramana maharshi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles