Jeeva as a super hero

jeeva as a super hero

jeeva as a super hero

40.gif

Posted: 07/26/2012 06:09 PM IST
Jeeva as a super hero

     Mugamoodi-poster ఆర్ బి చౌదరి తనయుడు కొత్త రూపం ఎత్తబోతున్నాడు. 'రంగం' చిత్రంతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న జీవా, త్వరలో సూపర్ హీరోగా ప్రేక్షకులను అలరించనున్నాడు. సూపర్ హీరోగా జీవా చేసే అద్భుతమైన విన్యాసాలు అదరహో అనిపించే స్థాయిలో ఉంటాయని చెప్పుకుంటున్నారు. భారీ బడ్జెట్ తో ఎన్నో వ్యయ ప్రయాసలకి ఓర్చి నిర్మిస్తోన్న ఈ సినిమా పేరు 'ముగమూడి'. యూటీవీ మోషన్ పిక్చర్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాకి మిస్కిన్ దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే కథానాయిక గా నటిస్తోన్న ఈ సినిమా, రెండు పాటల మినహా టాకీ పార్ట్ ను పూర్తి చేసుకుంది. ఈ రెండు పాటలను ప్రస్తుతం స్విట్జర్లాండ్ లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాని తమిళ్లో యూటీవీ మోషన్ పిక్చర్స్ వారు విడుదల చేస్తుండగా, తెలుగులో జీవా తండ్రి ఆర్.బి.చౌదరి విడుదల చేస్తున్నారు. ఈ రెండు భాషలలోను ఈ సినిమా ఆగస్టు 31 న ప్రేక్షకుల ముందుకి రానుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan bollywood movie
Allarinaresh kevvu keka  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles