Allarinaresh kevvu keka

allarinaresh kevvu keka

allarinaresh kevvu keka

41.gif

Posted: 07/26/2012 06:01 PM IST
Allarinaresh kevvu keka

       kekaఅల్లరి నరేష్ 'కెవ్వుకేక' పెట్టబోతున్నాడు. 'గబ్బర్ సింగ్' సినిమాలో దుమ్మురేపిన ఈ పాట ఇప్పుడు సినిమా టైటిల్ గా మారిపోయింది. 'కెవ్వుకేక' పేరుతో అల్లరి నరేష్ కథానాయకుడిగా ఓ సినిమా రూపొందుతోంది. జాహ్నవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై చంద్రశేఖర్ నిర్మిస్తోన్నారు.  సినిమా గురించి హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ ... గతంలో తాను దేవిప్రసాద్ డైరెక్షన్లో 'బ్లేడ్ బాబ్జీ' చిత్రంలో నటించాననీ ... ఆ సినిమా అనూహ్యమైన విజయాన్ని సాధించిందని చెప్పారు. తమ కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమాలో కూడా 'కెవ్వుకేక' అనిపించే స్థాయిలో కామెడీ ఉంటుందని అన్నారు. ఇక దేవిప్రసాద్ మాట్లాడుతూ, 'బ్లేడ్ బాబ్జీ' విజయం తన బాధ్యతని మరింత పెంచిందనీ ... ఆ సినిమాలో వర్కౌట్ చేసిన కామెడీకి రెండింతలు ఈ సినిమాలో చూడవచ్చని చెప్పారు. ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ కి వచ్చిన స్పందన తమకి మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోందని అన్నారు. సెప్టెంబర్ 14 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందనీ ... ఆ తరువాత షెడ్యూలును బ్యాంకాక్ లో ప్లాన్ చేశామని చెప్పారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles