Balakrishna latest movie shooting compleate in rapid speed

balakrishna latest movie shooting compleate in rapid speed

balakrishna latest movie shooting compleate in rapid speed

7.gif

Posted: 07/06/2012 04:44 PM IST
Balakrishna latest movie shooting compleate in rapid speed

        మేము ట్రెండ్ క్రియేట్ చేస్తాం.. తర్వాత అంతా దాన్ని ఫాలో అవుతారు.. ఇదీ.. బాలకృష్ణ ఈ మధ్య చేసిన ఒక బహిరంగ ప్రకటన. దీనికి బలం చేకూర్చేందుకో ఏమో.. అతని తాజా చిత్రం 'శ్రీమన్నారాయణ' షూటింగ్ ను శరవేగంగా పూర్తిచేసుకున్నాడీ యువరత్నం. ఈ మూవీ ఇప్పుడు టాలీవుడ్ లో 'టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ' అయిపోయింది. దీనికి కారణం... ఈ భారీ చిత్రం కేవలం మూడు నెలల్లో (ఇంకా bala_innereeచెప్పాలంటే... 85 రోజులే) షూటింగును పూర్తి చేసుకోవడమే! మామూలుగా పెద్ద హీరోల చిత్రాలకు ఇటీవలి కాలంలో కనీసం ఆరు నెలల సమయం పడుతోంది. అందులోనూ బాలకృష్ణ సినిమాల నిర్మాణం ఈమధ్య చాలా ఆలస్యమవుతోంది. దీనికి చాలా కారణాలున్నాయి. అయితే, దర్శకుడు సరైన ప్లానింగుతో వుండడం... నిర్మాతకు ఫైనాన్స్ ఇబ్బందులు లేకపోవడం... హీరో సహకారం వుంటే కనుక పెద్ద చిత్రాన్ని కూడా తక్కువ సమయంలో పూర్తి చేయచ్చని 'శ్రీమన్నారాయణ' చిత్రాన్ని బట్టి బాలయ్యబాబు రుజువు చేశారు. ఏళ్ల తరబడి సినిమాలు తీసి పరిశ్రమను ఖాయిలా పడనివ్వకుండా ఈ ర్యాపిడ్ షూటింగ్ ను అమల్లోకి తీసుకొస్తే బావుంటుంది కదా... 
     రవి చావలి దర్శకత్వంలో రమేష్ పుప్పాల నిర్మిస్తోన్న ఈ  చిత్రం ఇటీవలే మలేసియాలో ఒక పాటనీ ... కీలకమైన పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో జరిపారు.ఈ నెలలో నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని, ఆగస్టులో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  బాలకృష్ణ సరసన పార్వతీ మెల్టన్, ఇషా చావ్లా కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాకి చక్రి స్వరాలను సమకూర్చారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Producer dil raju gets andala rakshsi movie distribution rights
Tollywood young hero bharat in sad mood  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles