Producer dil raju gets andala rakshsi movie distribution rights

producer dil raju gets andala rakshsi movie distribution rights

producer dil raju gets andala rakshsi movie distribution rights

9.gif

Posted: 07/06/2012 05:27 PM IST
Producer dil raju gets andala rakshsi movie distribution rights

      aneఒక సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూసి ఆ మూవీ జాతకం చెప్పగల ఘనాపాటి దిల్ రాజు. ఈ సినీ  ముదురు చూపు ఇప్పుడు అందాల రాక్షసి మీద పడింది. అంతా కొత్త నటీనటులతో హను రాఘవపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం పరిశ్రమలో చాలా మందిని ఆకట్టుకున్నట్టు తెలుస్తుంది. “ఈగ” చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి తన 'వారాహి చలన చిత్రం' బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర ఆడియో విడుదల జరిగినప్పటి నుండి ఈ చిత్ర హక్కులను కొనడానికి పలువురు డిస్ట్రిబ్యుటర్స్ పోటీ పడ్డారు. అయితే, ఈ చిత్ర డిస్ట్రిబ్యుషన్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ఈ హక్కుల కోసమై ఈయన 3.75 కోట్లు చెల్లించినట్టు తెలుస్తుంది. and_f
      నూతన నటీనటులను పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈ చిత్రం చాలా మంచి ధర పలికింది. నవీన్ చంద్ర,రాహుల్ రవీంద్రన్ మరియు లావణ్య త్రిపాఠి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాధన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా మురళి జి ఛాయాగ్రహణం అందించారు. ఈ చిత్రం 1991లో జరిగిన ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఉంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ మూవీ ఈ నెలలోనే ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telugu imax sundari
Balakrishna latest movie shooting compleate in rapid speed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles