Famous chilukuri balaji on silverscreen

famous chilukuri balaji on silverscreen

famous chilukuri balaji on silverscreen

3.gif

Posted: 07/04/2012 01:40 PM IST
Famous chilukuri balaji on silverscreen

     2f కోరిందే తడవుగా కోట్లాదిమంది భక్తుల కోర్కెలు తీర్చే కలియుగ దైవం చిలుకూరి బాలాజీ స్వామి. ముఖ్యంగా యువతరానికి ఇష్టదైవంగా నిలిచిన చిలకూరి బాలాజీ అభ్యర్థించిన ప్రతీ కోరికనీ మన్నించి నెరవేరుస్తాడని ప్రతిఫలంగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయవలసి ఉంటుందని ప్రతీతి. ఈ చిలుకూరి ఆలయం నేపథ్యంలో 'చిలుకూరి బాలాజీ' సినిమా తెరకెక్కుతోంది. జై సంతోషియా, శ్రీవెంటేశ్వర మహత్త్యం, అన్నమయ్య, రామదాసు వంటి విజయవంతమైన భక్తి చిత్రాల కోవలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్ర దర్శకుడు అల్లాణి శ్రీధర్‌ చెబుతున్నారు. ఈటీవీ, ఫిల్మీడియా ప్రొడక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం అల్లాణిశ్రీధర్‌ కాగా, ప్రముఖ రచయిత అజరుశాంతి స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నారు. 2eee
     బాలాజీ స్వామి ఉపాసకులు, ఆచార్యులు ప్రధానకర్త సౌందర్యరాజన్‌ కథాకథనాలు విని అభినందించి విలువైన సూచనలు అందించారు. ఫిలింసిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లోనూ, చిలుకూరి బాలాజీ ఆలయం పరిసర ప్రాంతాల్లోనూ ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకుంటోంది. ఇప్పటివరకు మొదటి షెడ్యూల్‌ పూర్తయిందనీ, త్వరలో రెండవ షెడ్యూల్‌ ప్రారంభిస్తామనీ దర్శకుడు పేర్కొన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సెప్టెంబర్‌లో విడుదలచేయనున్నట్లు తెలిపారు.
    2ee  సాయికుమార్‌ హీరోగా, ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం తిరుమలదాసు అనే వాగ్గేయకారుడిగా, ఏవీఎస్‌ నారదునిగా నటిస్తుండగా, సునీల్‌శర్మ, భానుశ్రీమెహ్రా బాలాజీ, పద్మావతిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్రీనివాస్‌ కూనపరెడ్డి, సంగీతం: అర్జున్‌, పాటలు: జొన్నవిత్తుల, కాపర్తి వీరేంద్ర, రచన, దర్శకత్వం: అల్లాణి శ్రీధర్‌.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Music director keeravani birthday today
Criminal case on story writer chinni krishna  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles