Music director keeravani birthday today

music director keeravani birthday today

music director keeravani birthday today

5.gif

Posted: 07/04/2012 01:50 PM IST
Music director keeravani birthday today

      తెలుగు చిత్ర సీమలో పేరెన్నకగన్న సంగీత దర్శకుల్లో కీరవాణి ఒకరు. కీరవాణీ పాట మధురం.. ఆయన పాటలు వింటే మనసు ఉల్లాసంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుంది. ‘మనుసు మమత’ చిత్రంతో కీరవాణి హవా మొదలైంది. ఈ మూవీతో తెలుగు తెరకి పరిచమమైన కీరవాణీ 1961 జూలై 4న జన్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఎన్నో చిత్రాలకు సంగీతాన్ని అందించారు. 1997లో వచ్చిన అన్నమయ్య చిత్రానికి జాతీయస్థాయిలో ఉత్తమ సంగీత దర్శకునిగా పురస్కారాన్ని అందుకున్నారు. గాయకుని గానూ పలు తెలుగు, హిందీ చిత్రాల్లో తన గొంతు వినిపించారు. కీరవాణి స్వరపరచి ఆలపించిన రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే  పాటకు 3eeజాతీయ స్థాయిలో ఉత్తమ పాటగా అవార్డు అందుకుంది. కీరవాణి నాలుగు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, ఎనిమిది సార్లు నంది అవార్డులు అందుకున్నారు. నాగార్జున నటించిన ఎక్కువ చిత్రాలకు కీరవాణి సంగీత దర్శకత్వం వహించారు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలకూ సంగీతం అందించింది కీరవాణే.  కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 15చిత్రాలకు పైగా కిరవాణి సంగీత దర్శకత్వం వహించారు.
    సీతారామయ్యగారి మనవరాలు, క్షణ క్షణం, అల్లరి మొగుడు, మేజర్ చంద్రకాంత్, అల్లరి ప్రియుడు, అన్నమయ్య, శ్రీరామదాసు, నేనున్నాను, స్టూడెంట్ నంబర్ 1, ఛత్రపతి, సింహాద్రి, పెళ్లి సందడి వంటి సూపర్ హిట్ చిత్రాలకు  సంగీతం సమకూర్చారు. ఆయకనకు ఆంధ్రా విశేష్.కాం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.  హ్యాపీ బర్త్ డే కీరవాణీ గారూ......

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Samantha in prabhudeva bollywood pic
Famous chilukuri balaji on silverscreen  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles