Gabbar singh fifty days celebrations

gabbar singh fifty days celebrations

gabbar singh fifty days celebrations

6.1.gif

Posted: 06/29/2012 06:03 PM IST
Gabbar singh fifty days celebrations

      తెలుగు చిత్ర సీమలో తనకంటూ స్టైల్ నటనతో ఒక ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ 1eeeకళ్యాణ్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ “గబ్బర్ సింగ్”, భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించడమే కాకుండా ఈ చిత్రం ఈ రోజుతో 306 కేంద్రాలలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం హైదరాబాద్లో అత్యధిక కేంద్రాల్లో 50 రోజులు పూర్తిచేసుకున్న చిత్రంగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది కూడా..
        2eeeeefఈ చిత్రం విడుదలైన రోజునుంచి ఇప్పటికీ భారీగా కలెక్షన్లు రాబట్టుకుంటోంది. పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత ఒక బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తన అభిమానులకు ప్రేక్షకులకు అందించాడు.  ఈ చిత్రం ఇప్పటికే టాలీవుడ్ లో అత్యధిక రికార్డు కలెక్షన్స్ సాధించిన చిత్రాలలో ఒకటిగా చేరిపోయింది. ఈ చిత్రంలో అందాల భామ శ్రుతి హాసన్ కథానాయికగా నటించారు. ఈ చిత్రానికి యంగ్ తరంగ్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకుంటోంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పరమేశ్వరా ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.
     ఈ సినిమా 50 రోజుల దిగ్విజయంగా పూర్తి చేసుకోవటంతో పవర్ స్టార్ 2eeefఅభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. సోషల్ నెట్ వర్క్ సైట్స్లో అభిమానగణం వివిధ రూపాల్లో వారి సంతోషాన్నివ్యక్తంచేస్తున్నారు. 50డేస్ పోస్టర్లతో హల్ చల్ చేస్తున్నారు. చిత్ర ప్రదర్శింపడుతుతోన్న థియేటర్ల వద్ద పెద్దఎత్తున బ్యానర్లు ఏర్పాటు చేశారు పవన్ అభిమానులు. ఇంతటి ఘనవిజయాన్ని నమోదు చేసిన చిత్రాన్ని అందించిన పవర్ హీరో పవన్ కళ్యాణ్, దర్శక నిర్మాతలు హరీష్ శంకర్, బండ్ల గణేష్ ఇంకా చిత్ర యూనిట్ కూ ఆంధ్రావిశేష్.కాం శుభాకాంక్షలు చెబుతోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Al the best movie review
Young heros social service  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles