Young heros social service

young hero's social service

young hero's social service

12.gif

Posted: 06/29/2012 04:41 PM IST
Young heros social service

     ప్రస్తుతం చలన చిత్ర రంగంలో చాలా మంది హీరోలు ఇతరులకు సహాయం చేసి తమ ఔన్నత్యాన్ని చాటుకొంటున్నారు.4e అదే బాటలో తాజాగా యువ హీరోలు నవదీప్, మంచు విష్ణు కూడా చేరారు. అంగవైకల్యంతో ఉన్న చిన్నారులను ఆదుకునేందుకు నవదీప్ నడుంబిగించాడు. తన వంతుగా ఆపన్న హస్తాన్ని అందించాడు. హ్యాండీకేప్డ్ చిల్డ్రన్ ఉచితంగా చదువుకునేందుకు, ఇంకా హాస్టల్ వసతికోసం ఈ నెంబర్ లో సంప్రదించాలని కోరాడు. ఆ ఫోన్ నెం: 919713741020. అవసరార్థులకు మీరుకూడా ఈ నెంబర్ ఇచ్చి మీ వంతుగా మాట సాయం అందించవచ్చు.
      ఇక మంచు విష్ణు ఆంధ్ర ప్రదేశ్ సినీ స్టంట్ డైరెక్టర్స్, స్టంట్ ఆర్టిస్ట్ యూనియన్ కి ఇవాళ లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. విష్ణు కూడా స్టంట్స్ చేయడంలో శిక్షణ తీసుకున్న విషయం మనకు తెలిసిందే, తనకి స్టంట్స్ మీద ఉన్న ఇష్టంతో విష్ణు స్టంట్ అసోషియేషన్లో ఒకరురుగా తన పేరును కూడా నమోదు చేసుకున్నారు.4eee ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ ” డూప్ స్టంట్స్ చేసే వారి జీవితంలో ప్రమాదాలు పొంచి ఉంటాయని, డూప్స్ చేసే స్టంట్స్ వల్లే ప్రతి నటుడుకి మంచి పేరు వస్తుందని ఆయన అన్నారు. థియేటర్లలో అభిమానులు బాగా ఎంజాయ్ చేసే స్టంట్స్ కోసం డూప్స్ వాళ్ళ ప్రాణాలను పనంగా పెట్టి పనిచేస్తారని ఆయన అన్నారు.
     తాను చేసిన సహాయం కష్టాలలో ఉన్న నటులకి, వారి పిల్లల చదువుకి మరియు స్టంట్స్ చేసే వారి కుటుంబాలలో ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని ఆదుకోవడానికి వినియోగించాలని కోరాడు. ఇలా మంచి మనసుతో పలువురికి ఆదర్శప్రాయంగా నిలవటం నిజంగా ఆరోగ్యకరపరిణామమే కదా...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gabbar singh fifty days celebrations
Business man hd quality full movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles