Al the best movie review

al the best movie review

al the best movie review

13.gif

Posted: 06/29/2012 08:06 PM IST
Al the best movie review

1fffff

విడుదల తేది : 29 జూన్ 2012

దర్శకుడు : జే.డీ చక్రవర్తి
నిర్మాత : .సాంబశివరావు. జీ
సంగీత దర్శకుడు: హేమ చంద్ర
తారాగణం : శ్రీకాంత్, జే.డి చక్రవర్తి, లక్కీశర్మ
     నటనలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న జేడీ చక్రవర్తి అనంతరం దర్శకునిగా హొమం, సిద్ధం, మనీ మనీ మోర్ మనీ వంటి చిత్రాలు రూపొందించాడు. ఎగిరే పావురమా’ చిత్రం తరువాత శ్రీకాంత్, జే.డి చక్రవర్తి కలిసి నటించిన ప్రస్తుత ‘ఆల్ ది బెస్ట్’ చిత్రానికి జేడీనే దర్శకత్వం వహించారు కూడా.. లక్కీ శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు జి.సాంబశివరావు నిర్మాత. ఇవాళే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం...
కథ :
      జైలుకి వెళ్ళిన తన తండ్రిని విడిపించడానికి 15 లక్షలు అవసరమవడంతో ఎలాగైనా ఆ డబ్బు సంపాదించాలనుకున్న రవి  (శ్రీకాంత్) తప్పని పరిస్థితుల్లో ప్రజల్ని మోసగించే చందు (జే.డి చక్రవర్తి) తో చేతులు కలుపుతాడు. ఒక ల్యాండ్ డీల్ చేసి అందులో వచ్చిన డబ్బు ఇద్దరు పంచుకోవాలన్న ప్లాన్ తో 30 లక్షలు విలువ చేసే భూమిని రజాక్ (ప్రదీప్ రావత్) కి అమ్మాలని ప్లాన్ చేస్తారు. ఈ నేపధ్యంలో వీరి ప్లాన్ వర్కవుట్ అవుతుందే.. వారి లక్ష్యాన్ని చేరుకోవటంలో వారికి తలెత్తే అగచాట్టు క్లుప్తంగా ఈ సినిమా స్టోరీ.
అనుకూల ప్రతికూలాంశాలు :    శ్రీకాంత్ దే మెయిన్ పాత్రగా కనిపించి  చివరికి వచ్చే సరికి అతనిది కేవలం రెండో హీరో పాత్రని చేసాడు దర్శకుడు జేడీ .  శ్రీకాంత్ నటన కథకు తగ్గట్టుగానే సాగింది. కృష్ణ భగవాన్, తెలంగాణ శకుంతల మధ్య కామెడీ సన్నివేశాలు ఓ మోస్తరుగా పేలాయి. రఘుబాబు మరియు అతని అసిస్టెంట్ రఘు కనుమంచి మరికొంత మేర నవ్వించేందుకు యత్నించారు. ప్రదీప్ రావత్, బ్రహ్మాజీ పర్వాలేదనిపించారు. అంబాజీ రావు పాత్రలో రావు రమేష్ నాలుగైదు సన్నివేశాల్లో కనిపించి తన తండ్రి రావు గోపాలరావు గారిని ఇమిటేట్ చేసాడు. మొత్తంగా పెద్దగా చెప్పుకోదగ్గ అంశాలు ఈ సినిమాలో తక్కువనే చెప్పాలి. చక్రవర్తి నటుడిగా, దర్శకుడిగా రెండు పడవల మీద ప్రయాణం చేసి ఏ విభాగానికి సరైన న్యాయం చేయలేక పోయాడు.  గోచి సావిత్రి పాత్రలో నటించిన బ్రహ్మానందంని ఏ మాత్రం వాడుకోలేక పోవడం చూస్తేనే చక్రవర్తి దర్శకత్వ ప్రతిభ ఏ పాటిదో అర్ధమవుతుంది. లక్ష్మి ప్రసన్న పాత్రలో నటించిన లక్కీ శర్మ స్కిన్ షో చేసింది. ఆమె డైలాగ్స్ చెప్పడంలో లిప్ మూమెంట్ కొరవడింది. అనూష సింగ్ కేవలం ఒక పాటకే పరిమితం. మొత్తంగా “ఆల్ ది బెస్ట్”  టైటిల్ కీ కథకూ పోలిక కుదరదు.
చివరిగా  :
     హేమ చంద్ర సంగీతం చెప్పుకోదగ్గట్టుగా సాగలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతంతమాత్రమే.  సనా సనా పాట బావుంది. సాయి కార్తీక్ నేపథ్య సంగీతం, జి. శివ కుమార్ సినిమాటోగ్రఫీ రెండు కూడా కామెడీ సినిమాలకు తగ్గట్లుగా ఉన్నాయి. ఎడిటింగ్ విషయంలో ఎడిటర్ దారుణంగా విఫలమయ్యాడు. స్ర్కీన్ ప్లే, దర్శకత్వ ప్రతిభ కొరవడింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Stars cricket at vizag
Gabbar singh fifty days celebrations  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles