Pawan powerful role in ganga to rambabu movie

pawan powerful role in ganga to rambabu movie

pawan powerful role in ganga to rambabu movie

25.gif

Posted: 06/25/2012 07:15 PM IST
Pawan powerful role in ganga to rambabu movie

     9చూడబోతే.. మన గంగతో రాంబాబుకి పవరెక్కువలా కనిపిస్తుంది. అదే... “కెమెరా మెన్ గంగతో రాంబాబు” చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాత్ర ప్రేక్షకులను భారీగా అలరించబోతుందని సమాచారం. “గబ్బర్ సింగ్” వంటి భారీ విజయం తరువాత పూరి పవన్ కళ్యాణ్ ల జోడి ప్రేక్షకులను ఫుల్ మాస్ అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. పూరి పంచ్ డైలాగ్ లకి పవన్ ఎనర్జీ తోడయ్యి తెర మీద సునామి సృష్టించనున్నాయని వినికిడి. ఈ చిత్రానికి తమన్నా అందం మరొక ఆకర్షణ కానుంది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . మణిశర్మ సంగీతం అందిస్తుండగా శ్యాం కే నాయుడు ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ప్రకాష్ రాజ్ మరియు తనికెళ్ళ భరణి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ ను షేక్ చేసే విజయాన్ని అందుకున్న పవన్ మరో డూపర్ హిట్ కొడితే పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోతాయ్...
      మెగా ఫ్యామిలీకి చెందిన పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ 50 రోజులు పూర్తి చేసుకుని రికార్డు కలెక్షన్లతో దూసుకపోతోంది. 307 సెంటర్లలో విడుదలైన గబ్బర్ సింగ్ సినిమాకు మరి ఏ సినిమా కూడా పోటీ ఇవ్వలేకపోతోంది.  ఇప్పటివరకూ ఉన్న మగధీర రికార్డును చెరిపివేసే దిశగా పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ వెళుతోంది. మగధీర 50 రోజుల్లో రూ. 50 కోట్లు వసూలు చేస్తే, గబ్బర్ సింగ్ 50 రోజుల్లో సుమారు 76 కోట్ల రూపాయలు వసూలు చేసి తెలుగు సినీ ఇండస్ట్రీ బాక్సాఫీసు రికార్డులను షేక్ చేస్తోంది.
      గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ కల్యాణ్ నటన సింపుల్ అండ్ సుపర్బ్ గా ఉండటంతో ప్రేక్షకులు వారాంతాల్లో ఎగబడుతున్నారు ఈ సినిమాను చూసేందుకు. మొత్తమ్మీద భారీ విజయాల్లేక కూనారిల్లుతోన్న టాలీవుడ్ ఇండస్ట్రీకి గబ్బర్ సింగ్ హిట్ కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajamouli eega movie censor cleared
Superstar mahesh babu and his wife namrata social service  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles