Mega heroine tamanna dream come true

mega heroine tamanna dream come true

mega heroine tamanna dream come true

11.gif

Posted: 06/21/2012 04:40 PM IST
Mega heroine tamanna dream come true

     ఇంతకాలానికి నా కల నెరవేరినందుకు పట్టరాని సంతోషాన్ని వ్యక్తంచేస్తోంది మీల్కీ బ్యూటీ తమన్నా.  తెలుగు ప్రేక్షకులని అలరించే అందాల కథానాయికలలో ఈమె పేరు ముందు వరుసలో కనిపిస్తుంది.aaeff నిజం చెప్పాలంటే, ఆమెని దేవ కన్యలా భావించి ఆరాధించే అభిమానులూ లేకపోలేదు. అలాంటి తమన్నా ఇప్పుడు సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోతోందట. తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ సంగతి పక్కన పెడుతే, ఎంతో క్రేజ్ ... ఇమేజ్ ఉన్న పవన్ కల్యాణ్ సరసన అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని ఆమె  చెప్పింది. గతంలో తాను పూరీ దర్శకత్వంలోను ... పవన్ కల్యాణ్ జోడీగాను నటించాలని కలలు కన్నానని, అయితే వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న 'కెమెరామేన్ గంగతో రాంబాబు' చిత్రంలో కథానాయికగా అవకాశం దక్కుతుందని మాత్రం అనుకోలేదని అంది. ఇప్పటికీ కూడా ఈ విషయాన్ని తాను నమ్మలేకపోతున్నాననీ ... కలగానే అనిపిస్తోందని చెప్పింది. ఈ సినిమాలో వీడియో జర్నలిస్ట్ గంగ పాత్రని పోషిస్తున్నాననీ ... నటనకి అవకాశం ఉన్న ఈ పాత్ర లభించడం మరిచిపోలేని అనుభూతిని ఇస్తోందంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది.
      కాగా,  'గబ్బర్‌సింగ్‌' తర్వాత పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న 'కెమెరామన్‌ గంగతో రాంబాబు' కోసం సారథీ స్టూడియోస్‌లో ఓ ఖరీదైన సెట్‌ని కళాదర్శకుడు చిన్నా రూపొందించాడు. ఈ సెట్‌ కోసం ఏకంగా రూ.3 కోట్లు ఖర్చయినట్లు సమాచారం.ఈ సెట్‌ను డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దగ్గురుండి తనకు కావాల్సిన రీతిలో వేయించాడు. సినిమాకి ఈ సెట్‌ చాలా కీలకమైనదనీ, ఇందులో పలుకీలక సన్నివేశాల్ని తీస్తారనీ తెలుస్తోంది.ఈచిత్రంలో పవన్‌కళ్యాణ్‌ ఓ చానెల్‌ రిపోర్టర్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్లు ఈ సెట్‌లో అతను పనిచేసే టీవీ చానెల్‌ కూడా ఉంటుంది. అయితే ఈ సెట్‌కి ఎంత ఖర్చు చేసిందీ వెల్లడించేందుకు నిర్మాత డివివి.దానయ్య నిరాకరించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gochi savitri says all the best to you
World music day today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles