Gochi savitri says all the best to you

gochi savitri says all the best to you

gochi savitri says all the best to you

19.gif

Posted: 06/21/2012 07:36 PM IST
Gochi savitri says all the best to you

       టాలీవుడ్ ను నవ్వుల మాగాణిగా మార్చేసిన హాస్య నటుడు బ్రహ్మానందం అనటం అతిశయోక్తి కాదు.1.1f కథ ఏదైనా ... నాయకా నాయికలు ఎవరైనా అందులో బ్రహ్మానందానికి మాత్రం ఓ పాత్ర తప్పని సరిగా ఉంటుంది. ఆయనలేని సినిమా వెలితిగా అనిపిస్తుందనే మాటని అందరూ అంగీకరిస్తారు. అందుకే ప్రతి సినిమాలోనూ ఆయనకి ఓ ప్రత్యేక పాత్రని సృష్టిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో 'ఖాన్ దాదా' ... 'కత్తి రాందాస్' వంటి పాత్రలు ప్రేక్షకుల ముందుకి వచ్చి, అన్ని తరగతుల వారిని అలరించాయి. ఇప్పటికీ ఈ తరహా పాత్రలు ఆయనని వెదుక్కుంటూ వస్తూనే ఉన్నాయి.  ఇటీవల విడుదలైన 'దరువు' చిత్రంలో 'విద్యా బాలన్'గా కితకితలు పెట్టిన ఆయన, వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న 'చెర్రీ' చిత్రంలో 'మిస్టర్ జిలేబీ'గా పలకరించనున్నారు. ఇక 'ఆల్ ది బెస్ట్' చిత్రంలో ఆయన 'గోచీ సావిత్రి' గా కడుపుబ్బ నవ్వించనున్నారు. ఈ సినిమాలో ఈ పాత్రకి సంబంధించిన ప్రతి సన్నివేశం ప్రేక్షకులకి గిలిగింతలు పెడుతుందని దర్శకుడు జేడీ చక్రవర్తి చెప్పారు. దాంతో హాస్య ప్రియులంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 29 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. గోచీ సావిత్రికోసం అప్పటివరకూ వేచి ఉండాలి మరి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress nayana tara facing trouble
Mega heroine tamanna dream come true  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles