సంగీతం ఒక మహాసాగరం అని సంగీత విధ్వాంసులు అంటూఉంటారు. అంతటి సంగీతానికి ప్రత్యేకంగా ఒకరోజంటూ ఉంది అదే ఇవాళ. ఈ సందర్భంలో దీని నేపధ్యాన్ని ఓసారి పరికిస్తే.. 1982 నుంచి వరల్డ్ మ్యూజిక్ దినోత్సవాన్ని ఫ్రాన్స్ లో ఘనంగా జరుపుకోవడం ప్రారంభించారు. సంగీతాన్ని దశ దిశలా వ్యాప్తి చేసేందుకు ఫ్రాన్స్ లో ఫెటె డి ల మ్యూజిక్ డే ను ప్రారంభించారు. మొదట రెండు రోజుల పాటు ఈ సంగీతోత్సవాన్ని నిర్వహించే వారు. ఆ తర్వాత ప్రతి ఏటా జూన్ 21న ప్రపంచ సంగీత దినోత్సవంగా పరిగణిస్తున్నారు. ఈ సందర్భంగా నేడు ప్రపంచ వ్యాప్తంగా సంగీతాభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. సంగీతానికి మన దేశంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది.
మన సంగీతాభిమానులనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీతాభిమానులను కూడా మన గాయకులు, సంగీత విద్వాంసులు అలరించారు. మన త్యాగయ్య నుంచి నేటి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహ్మన్ వరకూ ఎంతో మంది తమ గాత్రంతో.. సంగీతంతో ప్రపంచాన్ని శాసించారు. మహా గాయని ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, భీంసేన్ జోషి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎల్లా వెంకటేశ్వరరావు.. ఇలా ఎందరో మహానుభావులు తన సంగీతంతో దేశానికి ఎవరెస్ట్ పర్వతమంత కీర్తిని తీసుకువచ్చారు. ఇక పాప్ సంగీతంలో పెను సంచలనం మైఖేల్ జాక్సన్. ఆయన పేరు వింటే పాప్ ప్రపంచం పులకించిపోతుంది.
మైఖేల్ జాక్సన్ ఏది పాడినా సంచలనమే. ఆయన పాట విని ప్రపంచ సంగీతాభిమానులు ఊగిపోయారు. మడోనా, షకీరా వంటి వారు కూడా పాప్ సంగీతాన్ని ఉర్రూతలూగించారు. సంగీతం వింటున్నప్పుడు ఓ ప్రపంచానికి రెప్ప మూసి ఇంకో ప్రపంచానికి రెక్క విప్పుతాం. దేహం ఇక్కడే ఉన్నా ఆత్మ ఎక్కడెక్కడో ప్రయాణిస్తుంది. అలా చేసే శక్తి ఒక్క సంగీతానికే ఉంది. అందుకే సంగీతంతో వ్యాధులు కూడా నయం చేస్తున్నారు. సంగతాభిమానులకు మరోసారి సంగీతదినోత్సవ శుభాకాంక్షలు చెబుతోందీ ఆంధ్రావిశేష్.కాం
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more