Pawan kalyan trend setter

pawan kalyan trend setter

pawan kalyan trend setter

1.gif

Posted: 06/21/2012 02:17 PM IST
Pawan kalyan trend setter

     నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. సెట్ చేస్తా... " అంటూ 'గబ్బర్ సింగ్'తో సరికొత్త రికార్డుల పరంగానే కాదు, చాలా అంశాల్లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన పవర్ స్టార్ పవన్ ఇప్పుడు సిని పరిశ్రమలో మరో సంచలనానికి  శ్రీకారం చుట్టాడు. 3eeసినిమా బడ్జెట్‌ నియంత్రణపై ఆయన దృష్టి పెట్టాడు. ఉదయం ఆరున్నర గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేయాలని పవన్‌ నిర్ణయించుకున్నాడు. తన కారణంగా షూటింగ్‌ ఆలస్యమైతే నిర్మాత నష్టపోయిన డబ్బును తిరిగి ఇవ్వాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. తనతో పాటు ఇతర ఆర్టిస్టులకు కూడా ఇవే నిబంధనలు విధించాలని ఆయన తన సన్నిహిత దర్శకులు, నిర్మాతలకు కూడా సూచిస్తున్నాడు. ఇవే నిబంధనలు మిగతా నటులకు వర్తింప చేయాలని ఆయన ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్‌కు సూచించాడు. దీని వల్ల పరిశ్రమ అభివృద్ధి చెందుతుందన్న ఆలోచనతోనే పవన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సినీ పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.  ఇప్పటికే ఇటువంటి  నిబంధనలు మలయాల పరిశ్రమలో అమలవుతున్నాయి. విజయవంతమవుతున్నాయి
    అంతేకాదు.. అభిమానుల మధ్య అనవసర వివాదాలకు తావిస్తున్న కలక్షన్ల రికార్డుల ప్రకటనకు అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో, తన సినిమా కలక్షన్లను అధికారికంగా ప్రకటించవద్దని 'గబ్బర్ సింగ్' నిర్మాతను ఆదేశించి, ఇటీవల టాలీవుడ్ లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.3e కొత్త టైమింగ్ ను అమలులోకి తీసుకువస్తూ ఇటీవల మొదలైన 'కెమెరామేన్ గంగతో రాంబాబు' చిత్రం షూటింగుకు ప్రతి రోజూ ఉదయం ఆరున్నరకే హాజరవుతున్నారు.  మామూలుగా,  పెద్ద హీరోల చిత్రం షూటింగు నిర్వహణకు రోజుకు లక్షల్లో ఖర్చవుతుంది. ఒక నియమం అన్నది లేకుండా ఆర్టిస్టులు కాల్ షీట్ టైముకి రాకుండా, తమ ఇష్టమొచ్చిన వేళకు షూటింగుకి రావడం వల్ల, ఇటీవలి కాలంలో సినిమా బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా హీరోలు, హీరోయిన్లు, ఇతర పెద్ద ఆర్టిస్టులు సమయపాలన (పంక్చువాలిటీ) విషయంలో తమ మూడ్ కి తగ్గట్టుగా వ్యవహరిస్తుండడం వల్ల, ఈ విషయంలో నిర్మాత విపరీతంగా నష్టపోతున్నాడు. దీనిని దృష్టిలో పెట్టుకునే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. బడ్జట్ నియంత్రణలో పవన్ తీసుకున్న ఈ నిర్ణయం ఆదర్శప్రాయమనీ, మిగతా హీరోలు కూడా దీనిని అనుసరిస్తే కొంతలో కొంత బడ్జెట్ అదుపులోకి రావటమేకాక, పరోక్షంగా పరిశ్రమ పదికాలాల పాటు పరిఢవిల్లే అవకాశం ఉంటుందని విశ్లేషకుల అంచనా..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vetern bollywood actor rajesh kanna il
Star music director ilayaraja greatness  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles