Young tiger take new step

young tiger take new step

young tiger take new step

35.gif

Posted: 06/20/2012 08:13 PM IST
Young tiger take new step

     యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త స్టెప్ తీసుకున్నారు.  కొద్ది రోజులు పాటు మీడియాకు,పబ్లిక్ పంక్షన్ లకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.1f దానికి రీజన్ ఏమిటంటే..తన తాజా చిత్రం బాద్షాలో ఎన్టీఆర్ కొత్త గెటప్ లో కనిపించనున్నారు. ప్రత్యేకంగా ముంబై నుంచి మేకప్ స్పెషలిస్టులు వచ్చి మరీ ఎన్టీఆర్ ని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. అందుకోసం ప్రత్యేకమైన ఫోటో సెసన్స్ కూడా నడిచాయి. దాంతో ఆ క్యూరియాసిటీ పోకుండా ఫస్ట్ లుక్ వదిలేవరకూ ఎన్టీఆర్ పబ్లిక్ లోకి రాకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ చిత్రం బిజినెస్ అప్పుడే మొదలైపోయింది. నెల్లూర్ రైట్స్ ని శ్రీనికేతన్ ఫిల్మ్స్ వారు తీసుకున్నామని కన్ఫర్మ్ చేసారు. గబ్బర్ సింగ్ కు కూడా మొదట వారే డిస్ట్రిబ్యూటర్ గా కన్ఫర్మ్ చేసారు. ఆ సినిమా సూపర్ హిట్ అవటంతో గణేష్ తను నిర్మిస్తున్న బాద్షా కి కూడా అదే డిస్ట్రిబ్యూటర్స్ చేత బిజినెస్ ప్రారంభించాడు. సెంటిమెంట్ గా ప్రారంబించిన దీనికి నామినల్ అడ్వాన్స్ ఆ ఏరియా నుంచి వచ్చింది. నెగోషియేషన్స్ తర్వాత జరగుతాయి.     

    1ff అంతేకాదు, తొలి షెడ్యూల్ ను ఏకధాటిగా 50 రోజుల పాటు ఇటలీలో ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. జూ ఎన్టీఆర్-కాజల్ కాంబినేషన్లో ఇప్పటికే బృందావనం లాంటి హిట్ సినిమా రావటంతో మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ హిల్లేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందించనున్నాడు. ఇప్పటికే రెడీ..దూకుడు లాంటి చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న శ్రీను వైట్ల ఈ సారి అంతకు మించిన ఎంటర్ టైన్మెంట్ సబ్జెక్టుతో ‘బాద్ షా' చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ ‘బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు. ఈ సినిమా మరో దూకుడు అవుతుందని, ఆ రేంజిని దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఆల్ ది బెస్ట్ యంగ్ టైగర్....

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sanjana take advantage
Vikram villan in and as denikaina ready  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles