Vikram villan in and as denikaina ready

vikram villan in and as denikaina ready

vikram villan in and as denikaina ready

9.gif

Posted: 06/20/2012 06:20 PM IST
Vikram villan in and as denikaina ready

      విష్ణు, హన్సిక జంటగా రూపొందుతున్న 'దేనికైనా రెడీ' సినిమాలో విలన్ గా విక్రమ్ కనిపించనున్నారు.1.1e విక్రమ్ అంటే 'అపరిచితుడు' హీరో కాదు ... అక్షరాలా మన ఎమ్మెస్ నారాయణ కొడుకు విక్రమ్. గతంలో ఇతను హీరోగా 'కొడుకు' అనే చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా పరాజయానికి పరాకాష్ట గా నిలవడంతో, ఆ తరువాత ఆ ప్రయత్నం చేయడానికి అతనెప్పుడు సాహసించ లేదు. ప్రేక్షకులు కూడా అతన్ని మరిచిపోయి చాలా కాలమై పోయింది. ఈ నేపథ్యంలో విలన్ పాత్రలకైనా ... మరి 'దేనికైనారెడీ' అనుకున్నాడేమో, అదే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. మరి కథానాయకుడి గా రిజక్ట్ చేసిన ఆడియన్స్ ... ప్రతినాయకుడిగా ఇతణ్ణి ఎంత వరకూ రిసీవ్ చేసుకుంటారనేది వేచి చూడాలి. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది ... ఆగస్టులో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 
     అంతేకాదు, దేనికైనా రెడీ సినిమాలో మరో వింత ఉంది. ఏమంటే.. హీరో మంచు విష్ణుకి మరో హీరో ప్రభాస్ డబ్బింగ్ చెబుతున్నాడు...1.1ee నమ్మబుద్ధికావడం లేదు కదూ... కానీ ఇది నిజం. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో విష్ణు నటిస్తున్న 'దేనికైనా రెడీ' చిత్రంలో ఈ తమాషా సంఘటన చోటు చేసుకుంటోంది. ఆ సినిమాలో కొన్ని చోట్ల తన అభిమాన హీరో ప్రభాస్ గొంతుని హీరో అనుకరించే సన్నివేశాలు వున్నాయి. అక్కడ తనకు ప్రభాస్ డబ్బింగ్ చెబితే నేచురల్ గా ఉంటుందని భావించి ప్రభాస్ ని అడగడం... ఆయన సరే అనడం.. జరిగిపోయాయట. ఈ విషయాన్ని విష్ణు ఆనందంతో చెబుతున్నాడు.  ఇదిలా ఉంచితే, త్వరలో తాను ఓ మల్టీ స్టారర్ లో నటిస్తున్నట్టు విష్ణు చెప్పాడు. తన తరం హీరోలు మరో ముగ్గురు ఈ చిత్రంలో నటిస్తారనీ, ఈ చిత్రంలో తన తండ్రి మోహన్ బాబు విలన్ గా నటిస్తారనీ విష్ణు తెలిపాడు. ఈ చిత్రం ద్వారా తూప్రాన్ శ్రీను అనే కుర్రాడిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నామని ఆయన చెప్పారు

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Young tiger take new step
Rajamouli eega effect julayi release post phoned  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles