Rana bollywood hava

rana bollywood hava

rana bollywood hava

11.gif

Posted: 05/28/2012 03:21 PM IST
Rana bollywood hava

      బాలీవుడ్ మూవీస్ కి కరెక్ట్ గా ఆప్ట్ అయ్యే రానా దానినే కోరుకుంటున్నాడు. జయాపజయాలతో నిమిత్తంలేకుండా రానా దగ్గుబాటి బాలీవుడ్ మీద దృష్టి ఎక్కువగానే పెడుతున్నట్టు కనిపిస్తోంది. rana_fఇటీవల 'డిపార్ట్ మెంట్' చిత్రంలో నటించిన ఆయన, తాజాగా ప్రముఖ దర్శకుడు కరణ్ జొహార్ నిర్మించే చిత్రంలో నటించడానికి అంగీకరించాడని తెలుస్తోంది. రణబీర్ కపూర్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రలు పోషించే ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకి రానా ఎంపికయ్యాడట. 'యహ్ జవానీ హై దీవానీ' పేరుతో ఆర్యన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతుందని అంటున్నారు. ఇదిలా ఉంచితే, తన తాజా హిందీ చిత్రం 'డిపార్ట్ మెంట్' అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ, ఆ విషయాన్ని రానా పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. అసలు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నటించడమే గొప్ప అనుభవమని రానా అన్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే పలు హిందీ చిత్రాల్లో త్వరత్వరగా నటించే అవకాశం చిక్కించుకున్న రానా మరింత స్పీడుతో బాలీవుడ్ ను ఏలేస్తే బావుంటుంది కదా...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amala paul movie elected for shangai film fete
Allari naresh movie sudigadu song shoot  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles