Nagarjuna with kajal

nagarjuna with kajal

nagarjuna with kajal

3.gif

Posted: 05/24/2012 01:28 PM IST
Nagarjuna with kajal

      nag_e1తెలుగు సినీ రంగంలో అక్కినేని ఫ్యామిలీ ప్రస్థానం చాలా సుదీర్ఘమైందనటం అతిశయోక్తి కాదు. అంతే కాదు ఎంత వయసొచ్చినా నవయవన్నంగా కనిపించటంలోనూ వారికి వారే సాటి. అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇక నాగ్ విషయానికి వస్తే..  ఏజ్ మీద పడుతున్న ఇప్పటికీ కుర్రహీరోలతో పోటీపడి నటిస్తున్నాడు. ఓ వైపు తన తనయుడు నాగచైతన్య యంగ్ హీరోగా దూసుకుపోతుండగానే.... నాగ్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం షిరిడీ సాయి, ఢమరుకం సినిమాల్లో నటిస్తున్న నాగార్జున... nag_e2ఈ సినిమాలు పూర్తయ్యాక దశరధ్‌ డైరెక్షన్‌లోని 'లవ్ స్టోరీ' అనే సినిమాలో నటించబోతున్నాడు. నయనతార హీరోయిన్‌గా నటించబోతున్న ఈ సినిమా డిసెంబర్‌ నాటికి ఆడియెన్స్ ముందుకు వస్తుందని తెలుస్తోంది.
 
      కాగా, నాగార్జున మరో సినిమా భాయ్... ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. పూలరంగడు డైరెక్టర్ వీరభద్రం ఈ సరికొత్త సినిమాకు దర్శకత్వం వహించబోయే ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నటించే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. గతంలో తన తండ్రి ఏఎన్నార్‌ సరసన నటించిన శ్రీదేవి వంటి ఎవర్‌గ్రీన్ బ్యూటీతోనూ పలు సినిమాల్లో నటించిన నాగార్జున... తనయుడు నాగచైతన్య సరసన దడ సినిమాలో రొమాన్స్ చేసిన కాజల్‌తో కూడా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా టాలీవుడ్ మన్మధుడిగా పేరు తెచ్చుకున్న నాగ్ కొత్త సినిమా తాజాగా వార్తల్లో నిలుస్తుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aswini dutt daughter question
Pawan kalyan in krishnam vande jagadgurum movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles