Maniratnam gharshana movie remake

maniratnam gharshana movie remake

maniratnam gharshana movie remake

7.gif

Posted: 05/22/2012 04:21 PM IST
Maniratnam gharshana movie remake

       ఈమధ్య రీమేక్ చిత్రాలకు పెద్దపీట వేస్తున్నారు బాలీవుడ్ తో పాటు పలు చిత్ర పరిశ్రమలకు చెందిన దర్శక నిర్మాతలు. అందులో భాగంగానే.. నేటి రీమేక్స్ ట్రెండ్ లో పాతికేళ్ళనాటి మరో సూపర్ హిట్ సినిమా కూడా చేరుతోంది. mani_eప్రముఖ దర్శకుడు మణిరత్నం తమిళంలో రూపొందించిన 'అగ్నినక్షత్రం' చిత్రాన్ని రీమేక్ చేయడానికి ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రభు, కార్తీక్, అమల, నిరోషా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని 'ఘర్షణ' పేరిట తెలుగులోకి అనువదించగా, ఇక్కడ కూడా అది పెద్ద సక్సెస్ సాధించింది. ఈ చిత్రం కోసం ఇళయరాజా అందించిన స్వరాలు నేటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే వున్నాయంటే ఆ చిత్రం ఎంతటి ప్రజాభిమానాన్ని దక్కించుకుందో తెలుసుకోవచ్చు.
        అయితే, తమిళంలో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ అయిన బాలాజీ రియల్ మీడియా సంస్థ ఈ రీమేక్ నిర్మాణాన్ని చేబడుతోంది. ఆ చిత్రాన్ని అప్పటి ఫ్లేవర్ పోకుండా తెరకెక్కించగలిగే దర్శకుని కోసం ప్రస్తుతం అన్వేషిస్తున్నారు. అలాగే, ప్రధాన పాత్రలను సమర్ధవంతగా పోషించగలిగే తారల కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ఏకకాలంలో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nathalia kour in department
Daruvu movie release on 25th may  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles