Mega family logo

mega family logo

mega family logo

29.gif

Posted: 05/20/2012 04:16 PM IST
Mega family logo

      రామ్ చరణ్ వివాహానికి సంబంధించిన పెళ్లి శుభలేఖల పంపిణీ మొదలైంది. ఢిల్లీ లో డిజైన్ చేయించి అక్కడే ముద్రించిన ఈ ఖరీదైన శుభలేఖలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. చిరంజీవి ఇష్టదైవమైన ఆంజనేయస్వామి చిహ్నాన్ని కార్డు ముందు భాగంపై ముద్రించగా, వెనుక భాగంలో 'కొణిదెల ఫ్యామిలీ'కి చిహ్నంగా డిజైన్ చేయించిన ఓ ప్రత్యేకమైన లోగోను ముద్రించారు.logo_e
        KC అనే ఆంగ్ల అక్షరాలతో ఈ లోగోను డిజైన్ చేశారు. చిరంజీవి సన్నిహితులు, అల్లు అరవింద్ ఆఫీసుకు చెందిన సిబ్బంది చిరంజీవిని KC (కొణిదెల చిరంజీవి) అనే సంక్షిప్త నామంతో సంబోధిస్తూ వుంటారు. అందుకే, ఆ పేరుతో ప్రత్యేక లోగోను చేయించుకున్నారు. ఇకపై ఆ కుటుంబానికి చెందిన అన్ని ప్రైవేటు వ్యవహారాలలోనూ ఈ లోగోను ఉపయోగిస్తారని తెలుస్తోంది.
       ఇక, జూన్ 14 ఉదయం 7 గంటల 30 నిముషాలకు చరణ్, ఉపాసనల వివాహం హైదరాబాదు శివారు గండిపేటలోని ఫామ్ హౌస్ లో జరుగుతుంది. ఈ వేడుకకు 5000 మందిని ఆహ్వానిస్తున్నారు. అలాగే, ఆ రాత్రి HICC ప్రాంగణంలో జరిగే విందుకి 10000 మందిని ఆహ్వానిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amy jackson
Ntr birthday special  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles