Ntr birthday special

ntr birthday special

ntr birthday special

27.gif

Posted: 05/20/2012 04:10 PM IST
Ntr birthday special

       మహానటుడు ఎన్టీఆర్ మనవడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్... ఇప్పుడు టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది క్రేజీ హీరో. తారకరాముడి రూపం, ఆకట్టుకునే అభినయం, ఇలా జూనియర్ ఎన్టీఆర్‌ను స్టార్ హీరోగా మార్చేశాయి. నందమూరి మూడోతరం నటవారసుడిగా వెండితెరకు పరిచయమైన ఎన్టీఆర్... ఇంత పెద్ద స్టార్ హీరో అవుతారని ఎవరూ ఎక్స్‌ పెక్ట్ చేయలేదు. సోలో హీరోగా నటించిన తొలి సినిమా సినిమా నిన్ను చూడాలని అంతంతమాత్రంగానే ఆకట్టుకోవడంతో ఎన్టీఆర్‌... ఓ యావరేజ్ హీరోగానే మిగిలిపోతాడని చాలామంది అనుకన్నారు. కానీ తన రెండో సినిమా స్టూడెంట్ నెంబర్‌వన్‌తో తాను స్టార్ హీరో అవ్వగలనని అప్పుడే ఫ్రూవ్ చేసుకున్నాడు ఈ చిచ్చరపిడుగు. మ్యూజికల్ గా సూపర్ డూపర్ హిట్టయిన స్టూడెంట్ నెంబర్ వన్ లో ఎన్టీఆర్ పెర్ఫామెన్స్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.        ఇక తనలో ఎంతటి పవర్‌ఫుల్ యాక్టింగ్ దాగివుందో ఆది సినిమాతో చూపించాడు ఈ యంగ్ టైగర్. ఇప్పటికి సరిగ్గా పదేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌ను మలుపు తిప్పింది. వి.వి.వినాయక్ దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టింది. ఎన్టీఆర్‌కు స్టార్‌డమ్ తెచ్చిపెట్టింది. ఫ్యాక్షన్ సినిమాల్లో సరికొత్త యాక్షన్‌ను చూపించింది. ఎన్టీఆర్‌కు స్పెషల్ జ్యూరీ అవార్డు తెచ్చిపెట్టింది. nt_e1      

      అది వంటి సూపర్ డూపర్ హిట్ తో మంచి జోష్ మీదున్న ఎన్టీఆర్ రాజమౌళి డైరెక్షన్‌లో నటించిన రెండో సినిమా సింహాద్రితో బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేశాడు. సింహాద్రిగా... సింగమలైగా ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించిన తీరు ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంది. అయితే సింహాద్రి తరువాత మూడేళ్ల పాటు సరైన హిట్స్ లేక సతమతమయ్యాడు ఈ యంగ్ హీరో. ఆది తరువాత వచ్చిన అల్లరి రాముడు, నాగ ఆడియెన్స్‌ను అంతలా ఆకట్టుకోలేకపోయాయి. అయితే ఎన్టీఆర్‌తో స్టూడెంట్‌ నెంబర్ సినిమా తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళి... మరోసారి ఎన్టీఆర్‌కు పెద్ద హిట్ ఇచ్చాడు. సింహాద్రిగా ఎన్టీఆర్‌ను ఓ పవర్‌ఫుల్ రోల్‌లో ప్రజెంట్‌ చేశాడు. ఈ సూపర్ హిట్ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లను సాధించడంతో పాటు ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్‌ను మరింతగా పెంచేసింది.      

       సింహాద్రి తరువాత ఎన్టీఆర్ కెరీర్ ఎన్నోఆటుపోట్లను ఎదురుకుంది. సింహాద్రితో మాస్ హీరోగా తిరుగులేని ఇమేజ్ సాధించిన ఈ యంగ్ టైగర్... ఆ తరువాత నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద అనూహ్యాంగా పరాజయం పాలయ్యాయి. ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహాడు, ఆశోక్, రాఖీ ఇలా మూడేళ్ల కాలంలో ఈ యంగ్ హీరో నటించిన ఆరు సినిమాలు పెద్దగా సక్సెస్‌ను సాధించలేకపోయాయి. సాంబ, రాఖీ వంటి సినిమాలు ఫర్వాలేదనించినా... ఈ సినిమాలు సూపర్ హిట్ స్ధాయిని మాత్రం చేరుకోలేకపోయాయి. ఇలా మూడేళ్ల పాటు హిట్ కోసం ఎంతగానో పరితపించినా ఎన్టీఆర్‌కు దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి బ్రేక్ ఇచ్చాడు. అప్పటి వరకు బొద్దుగా ఉన్న ఎన్టీఆర్‌ను స్లిమ్‌గా మార్చి.... యమదొంగను చేశాడు. తొలిసారిగాసోషియో ఫాంటసీ సినిమాను తెరకెక్కించి ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. nt_e2             

      ఇక గతేడాది ఎన్టీఆర్ తొలిసారిగా లవర్ బాయ్ క్యారెక్టర్‌లో నటించిన బృందావనం సినిమా ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంది. దీంతో యాక్షన్ ఓరియెంటెడ్ లవ్ స్టోరీస్‌లోనూ మెప్పించగలనని నిరూపించాడు ఈ యంగ్ హీరో. 2010లో విడుదలైన ఈ సినిమా ఆ ఏడాది సూపర్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. మరోవైపు గతేడాది శక్తి, ఊసరవెల్లి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ టైగర్ ఈ ఏడాది దమ్ము సినిమాతో హిట్ కొట్టాడు. వరుస హిట్స్‌తో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీను ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీ మాస్ ఆడియెన్స్‌ను బాగా అలరిస్తోంది. ప్రస్తుతం శ్రీను వైట్ల డైరెక్షన్‌లో 'బాద్ షా' అనే సినిమాలో నటిస్తున్నఈ టాలీవుడ్ క్రేజీ హీరో ఆ తరువాత పూరి జగన్నాధ్, హరీష్ శంకర్ డైరెక్షన్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇలా వరుస సినిమాలతో ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేయబోతున్న ఎన్టీఆర్ మరిన్ని వసంతాలు పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ ఈ యంగ్ టైగర్‌కు బర్త్‌ డే విషెస్ అందిస్తోంది ఆంధ్రావిశేష్.కాం

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mega family logo
Manchu manoj birthday  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles