Manchu manoj birthday

manchu manoj birthday

manchu manoj birthday

25.gif

Posted: 05/20/2012 04:07 PM IST
Manchu manoj birthday

       'మేజర్ చంద్రకాంత్' ... 'పుణ్యభూమి నాదేశం' ... 'అడవిలోఅన్న' వంటి చిత్రాల్లో బాలనటుడిగా కనిపించిన మనోజ్, 'దొంగ దొంగది' చిత్రం ద్వారా హీరో గా పరిచయమయ్యాడు. ఆ తరువాత  'రాజు భాయ్' ... 'నీను మీకు తెలుసా' ... 'బిందాస్' ... 'వేదం' ... ఝుమ్మంది నాదం' ... 'మిస్టర్ నూకయ్య' వంటి చిత్రాల్లో విభిన్నమైన పాత్రలని పోషించాడు.mn_e అయితే ఈ సినిమాల్లో 'బిందాస్' ... 'వేదం' మాత్రమే అతని కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాలుగా నిలిచాయి. అయితే ఏ సినిమాలోనూ నటుడిగా అతను ఫెయిల్ కాలేదు. నటనలోగానీ ... డాన్స్ లోగానీ ... ఫైట్స్ లో గాని అతను వీక్ అనే టాక్ ఎప్పుడూ రాకపోవడం గమనించదగిన విషయం. నటుడిగా ఈ ఎనిమిదేళ్ల ప్రయాణంలో ఆశించిన విజయాలు అంతంత మాత్రంగానే దక్కినా మనోజ్ కుంగి పోలేదు ... కుమిలిపోలేదు. పరాజయాలను పాఠాలుగా చేసుకుంటూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకి దూకుతునే వున్నాడు. తనని తాను విభిన్న కోణాల్లో ఆవిష్కరించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు. ఈ నేపథ్యంలోనే అతను 'ఊకొడతారా ఉలిక్కి పడతారా' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ రోజు మనోజ్ పుట్టిన రోజు. అటు తెరపైనా ... ఇటు బయటా ఎప్పుడూ చురుకుగా - చలాకీగా వుండే మనోజ్ మరెన్నో బర్త్ డేలు జరుపుకోవాలనీ ... సక్సెస్ ఫుల్ హీరోగా నిలదొక్కుకోవాలని ఆశిస్తోంది ఆంధ్రావిశేష్.కాం

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ntr birthday special
Sirivennela birthday  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles