Gabbar singh movie in tamilnadu

gabbar singh movie in tamilnadu

gabbar singh movie in tamilnadu

9.gif

Posted: 05/18/2012 04:09 PM IST
Gabbar singh movie in tamilnadu

      1 పవర్ స్టార్ 'గబ్బర్ సింగ్' చిత్రం ఇటు తెలుగులోనే కాదు ... అటు తమిళంలోనూ తన హవాని కొనసాగిస్తోంది.  ఈ సినిమాలో ''నాక్కొంచెం తిక్కుంది ... కానీ దానికో లెక్కుంది'' అంటూ పవన్ చెప్పిన డైలాగ్, తమిళ తంబీలకి సైతం విపరీతంగా ఎక్కేసిందని అంటున్నారు. ఈ డైలాగ్ ని ''ఎనక్కు కొంజెం పైత్యం ఇరుక్కు ... అదక్కు ఒరు కానా ఇరుక్కు'' అని తమ భాష లోకి మార్చుకుని యమా ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు చెన్నై ... మదురై ... కోయంబత్తూర్ ... తిరుచ్చి ... సేలం ... తదితర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఈ డైలాగే వినిపిస్తోందట.
       ఇక్కడ ఇంకో విచిత్రం ఏమిటంటే, 'దబాంగ్' రీమేక్ గా తమిళ్ లో 'ఓస్తీ' అనే పేరుతో సినిమా ఆల్రెడీ వచ్చేసింది. శింబూ హీరోగా చేసిన ఈ సినిమా అక్కడి ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ సినిమాతో అసంతృప్తికి గురైన ప్రేక్షకులు ఇప్పుడీ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. మొత్తానికి తెలుగునాటేకాదు.. తమిళనాటా పవన్ అభిమానగనం కరువుతీరిపోయే విజయం సిద్ధించిందన్నమాట.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nani range in tamilnadu
Ram gopal varma department movie release today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles